గుబ్బల మంగమ్మ గుడి వద్ద టూరిజం అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

గుబ్బల మంగమ్మ గుడి వద్ద టూరిజం అభివృద్ధికి కృషి

Apr 10 2026 9:33 AM | Updated on Apr 10 2026 9:33 AM

బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి గుడిని ఏపీ ఫారెస్ట్‌ పీసీసీఎఫ్‌ మాజీ అధికారి, ప్రభుత్వ రాష్ట్ర అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గుబ్బల మంగమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో టూరిజం పరంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన వనరులపై, అధికారులను, కమిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుబ్బల మంగమ్మ గుడి అటవీప్రాంతంలో ఉన్నందున ఆ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వల్ల కలిగే కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు, కమిటీ సభ్యులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ముఖ్యంగా భక్తులు ప్లాస్టిక్‌ గ్లాసులు, కవర్‌లు వాడకుండా అవగాహన కలిగించాలన్నారు. ఆలయ పరిసరాల్లో డీఎఫ్‌ఓ పర్యవేక్షణలో స్టాగ్‌ (ప్రదర్శన బోర్డు చిహ్నం) ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ సందీప్‌ రెడ్డి, సబ్‌ డీఎఫ్‌ఓ వెంకట సుబ్బయ్య, జంగారెడ్డిగూడెం రేంజ్‌ అధికారి దుర్గాకుమార్‌బాబు, ములగలంపల్లి సెక్షన్‌ ఆఫీసర్‌ కె.రాంబాబు, ఆలయ కమిటీ ప్రతినిధులు కోర్సా రాంబాబు, కె. గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement