కాలువ వంతెనను ఢీకొట్టిన లారీ | - | Sakshi
Sakshi News home page

కాలువ వంతెనను ఢీకొట్టిన లారీ

Apr 7 2026 9:31 AM | Updated on Apr 7 2026 9:31 AM

తణుకు అర్బన్‌: తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై అదుపు తప్పిన లారీ కాలువ వంతెన రెయిలింగ్‌ను ఢీకొట్టి నిలిచింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. రావులపాలెం నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళుతున్న లారీ తేతలి జాతీయ రహదారిపై కాల్వ వంతెన వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వంతెన రెయిలింగ్‌తోపాటు లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనా స్థలానికి హైవే, తణుకు రూరల్‌ పోలీసులు చేరుకుని ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. తణుకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement