రైలు ప్రమాదంలో సీఐఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాదంలో సీఐఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ మృతి

Apr 6 2026 8:42 AM | Updated on Apr 6 2026 8:42 AM

రైలు ప్రమాదంలో సీఐఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ మృతి స్కూల్లో రూ.2 లక్షల చోరీ

ఏలూరు టౌన్‌: ఏలూరు నగరానికి చెందిన గోపిరెడ్డి హేమంత్‌ సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌)లో సబ్‌ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్‌ రైలులో ప్రయాణిస్తూ ఉండగా.. మధ్యలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతిచెందారు. హేమంత్‌ భౌతికకాయాన్ని నేడు ఏలూరు పత్తేబాదలోని ఆయన స్వగృహానికి తీసుకురానున్నారని బంధువులు తెలిపారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిపారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

చాట్రాయి: చాట్రాయి ఆర్‌సీఎం స్కూల్లో ఆదివారం నగదు చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్కూలు సిబ్బంది జీతాల కోసం రూ.2 లక్షలు స్కూలు యాజమాన్యం ఆఫీసు రూంలో పెట్టి తాళం వేసి ఈస్టర్‌ పండుగను జరుపుకున్నారు. సాయంత్రం చర్చి నుంచి ఆఫీసుకు రాగా తాళాలు పటలకొట్టి రూ.2 లక్షల నగదును దొంగిలించారు. దీంతో యాజమాన్యం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేసింది. నూజివీడు డీఎస్పీ వీఎన్‌వీ ప్రసాదు, సీఐ, ఎస్‌ఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement