కారు ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వ్యక్తి మృతి

Apr 5 2026 9:24 AM | Updated on Apr 5 2026 9:24 AM

కారు ఢీకొని వ్యక్తి మృతి

కై కలూరు: కారు బైక్‌ను ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించిన ఘటన ఆలపాడు ప్లైఓవర్‌ బ్రిడ్జిపై శనివారం జరిగింది. కై కలూరు రూరల్‌ పోలీసుల వివరాలు ప్రకారం భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామానికి చెందిన మామిడి శ్రీను(45) కై కలూరు మండలం ఆలపాడులో చిన్న అల్లుడు పులిపాక సుబ్బారావుతో కలిసి బైక్‌పై ఆకివీడు వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఆలపాడు ప్లైఓవర్‌ బ్రిడ్జిపై ఆకివీడు నుంచి వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. వెనుక కూర్చున్న శ్రీను మరణించాడు. ద్విచక్రవాహం నడుపుతున్న సుబ్బారావుకు గాయాలయ్యాయి. కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెద్ద అల్లుడు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement