ఈస్టర్‌ పండుగకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

ఈస్టర్‌ పండుగకు సన్నద్ధం

Apr 5 2026 9:24 AM | Updated on Apr 5 2026 9:24 AM

ఉండి: గుడ్‌ఫ్రైడే జరుపుకున్న క్రైస్తవ సోదరులు ఆదివారం జరిగే ఈస్టర్‌ పండుగ కోసం సిద్ధమవుతున్నారు. మృతిచెందిన తమ వారి సమాధులను శనివారం పరిశుభ్రంగా కడిగి రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు. పూలు, పండ్లు, కొవ్వొత్తులు, విద్యుత్‌ లైట్లతో సమాధులను అలంకరించి ఆదివారం తెల్లవారు జామున చర్చ్‌ నుంచి బయలుదేరి సమాధుల వద్దకు ఊరేగింపుగా వెళ్తారు. బాణసంచా కాల్పులతో, భక్తి కీర్తనలతో ఊరేగింపు నిర్వహిస్తారు. క్రైస్తవులు తమవారి సమాధుల వద్దకు వెళ్ళి ప్రార్థనలు నిర్వహిస్తారు. ఒకరినొకరు ప్రేమతో పలకరించుకుంటూ ఈస్టరు పండుగ శుభాకాంక్షలు తెలుపుతారు. అనంతరం ఉదయం చర్చిల్లో జరిగే కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని ప్రార్థనలు చేస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement