డివైడర్‌ను ఢీకొట్టిన కారు | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొట్టిన కారు

Apr 4 2026 8:07 AM | Updated on Apr 4 2026 8:07 AM

ఆలమూరు: 216ఏ జాతీయ రహదారిలో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా చొప్పెల్ల వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలమూరు ఎస్సై జి.నరేష్‌ కథనం ప్రకారం.. చింతలపూడికి చెందిన సుంకర నవీన్‌, చందుమళ్లకు చెందిన కె.రామ్‌తేజ, పాలకొల్లుకు చెందిన కె.శివాజీ గణేష్‌కుమార్‌ కారులో విశాఖపట్నం బయలు దేరారు. చొప్పెల్ల లాకుల వద్దకు వచ్చేసరికి రాంగ్‌ రూట్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి డివైడర్‌ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. అందులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్‌హెచ్‌, 108 అంబులెన్స్‌లలో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి రాజమహేంద్రవరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎస్సై నరేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ముగ్గురికి తీవ్ర గాయాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement