ఇంటర్మీడియట్‌లో 66 శాతం ఉత్తీర్ణత
● ప్రథమంలో రెగ్యులర్ 23,
ఒకేషనల్ 6.. ద్వితీయం రెగ్యులర్‌లో 21, ఒకేషనల్‌లో 11 స్థానంలో నిలిచిన జిల్లా
● గతేడాది కంటే కంటే కాస్త
మెరుగుపడిన ఫలితాలు
ఉత్తీర్ణులు కావడంతో 72.58 శాతం, బాలురు 3,053 మంది పరీక్షలు రాయగా 1,464 ఉత్తీర్ణులు కావడంతో 47.95 శాతం నమోదైంది.
రెండో సంవత్సరం..
జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 5,625 మంది పరీక్షలు రాయగా.. 4,047 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 3,055 మంది పరీక్షలకు హాజరుకాగా.. 2,488 మంది ఉత్తీర్ణులై 81.44 శాతం, బాలురు 2,570 మంది పరీక్షలు రాయగా 1,559 మంది ఉత్తీర్ణులై 61 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తంగా బాలికలు 6,221 మంది, బాలురు 5,623 మంది పరీక్షలు రాయగా.. బాలికలు 4,786 మంది, బాలురు 3,023 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికలు 559 మంది అధికంగా ఉన్నారు.
వనపర్తిటౌన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాల్లో మొదటి, రెండో సంవత్సరం కలిపి జిల్లావ్యాప్తంగా 66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలోని 12 ప్రభుత్వ, 26 రెసిడెన్షియల్ కళాశాలలు, 19 ప్రైవేట్ కళాశాలల నుంచి మొత్తం 11,844 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 7,809 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 60.49, రెండో సంవత్సరంలో 70.99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 2024–25 విద్యాసంవత్సరం మొదటి సంవత్సరం ఫలితాల్లో జిల్లా 59 శాతానికి పరిమితం కాగా.. 2025–26లో కేవలం ఒక శాతం పెరుగుదల కనిపించంది. రెండో సంవత్సరంలో 2024–25లో 67 శాతంతో సరి పెట్టుకోగా 2025–26 ఫలితాల్లో 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లావ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 6,221 మంది బాలికలు హాజరుకాగా.. 4,786 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా బాలుర కంటే బాలికలు 1,763 మంది అధికంగా ఉత్తీర్ణులై పైచేయి సాధించారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రెగ్యులర్ 23, ఒకేషనల్‌లో 6.. ద్వితీయ సంవత్సరం రెగ్యులర్‌లో 21, ఒకేషనల్‌లో 11 స్థానంలో జిల్లా నిలిచింది.
మొదటి సంవత్సరం..
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 6,219 మంది విద్యార్థులు హాజరుకాగా.. 3,762 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 3,166 మంది పరీక్షలు రాయగా 2,298 మంది


