● హాజరుకానున్న మంత్రి
వాకిటి శ్రీహరి
అమరచింత: పుర కార్యాలయంలో సోమవారం జరిగే కో–ఆప్షన్ ఎన్నికలో పాల్గొని ఎక్స్–అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం రానున్నారు. 4 కో–ఆప్షన్ స్థానాలకు అధికార కాంగ్రెస్‌పార్టీతో పాటు బీజేపీ, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు సైతం తమ మద్దతుదారులతో నామినేషన్లు వేయించారు. మొత్తం 8 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే అత్యధిక కౌన్సిలర్ల మద్దతు ఉంటేనే కో–ఆప్షన్ ఎన్నిక జరుగుతుందని పుర కమిషనర్ నూరుల్ నదీం తెలిపారు.
● పుర ఎన్నికల్లో కాంగ్రెస్–3, బీఆర్‌ఎస్–3, బీజేపీ–3, సీపీఎం–1 వార్డులను దక్కించుకున్నాయి. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆ సంఖ్యకు నాలుగుకు చేరింది. కాంగ్రెస్‌పార్టీ సీపీఎం మద్దతు, మంత్రి ఎక్స్ అఫీషియో ఓటుతో పుర చైర్‌పర్సన్ స్థానాన్ని దక్కించుకుంది. కో–ఆప్షన్ ఎన్నికలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెరో ఐదుగురు కౌన్సిలర్లు ఉంటే డిప్ సిస్టంలో ఎన్నిక జరిగేది. అలాగాకుండా అవగాహనతో అందరూ ఒక్కో కో–ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకోవాలనే ఆలోచనలో ఆయా పార్టీల నేతలు ఉన్నారు. తీరా కో–ఆప్షన్ ఎన్నికకు కూడా మంత్రి హాజరవుతున్నట్లు మున్సిపల్ కమిషనర్‌కు షెడ్యూల్ రావడంతో ఇక ఎన్నిక లాంచనమే. ఇక అన్ని కో–ఆప్షన్ స్థానాలు అధికార పార్టీ కై వసం కానున్నాయి.


