వనపర్తి: ప్రభుత్వ వసతి గృహాల్లో మెనూ కచ్చితంగా అమలు చేయడంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల గదులు, వంటశాల (కిచెన్), స్టాక్‌రూమ్, హాస్టల్‌లోని వసతులను పరిశీలించారు. ఎల్పీజీ సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని విచారించి సమస్యలు ఉంటే వెంటనే తహసీల్దార్ దృష్టికి తీసుకురావాలని, పరిష్కరిస్తారని చెప్పారు. విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. నాణ్యమైన బియ్యం సరఫరా అవుతున్నాయా లేదా అని ఆరా తీశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
‘డబుల్’ కాలనీలో వసతులు కల్పించాలి..
రాజపేట శివారులోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కాలనీని కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన రహదారికి అనుసంధానం, డ్రైనేజీ సమస్యలను స్థానికులు వివరించగా.. త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి


