యాసంగిలో జూరాల ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో 7 ఎకరాల్లో వరి సాగుచేశా. ప్రాజెక్టు ముందు భాగంలో ఉన్న గ్రామం కాబట్టి వారబంది విధానంలో నీటిని వదులుతున్నా సద్వినియోగం చేసుకుంటున్నా. ప్రస్తుతం పంట చేతికి రావాలంటే మరో మూడు తడులైనా నీటిని అందించాలి.
– మైను, రైతు, నందిమళ్ల
ఐదు తడులు అవసరం..
జూరాల ఎడమ కాల్వ ద్వారా వారబంధి విధానంలో ఆయకట్టుకు సాగునీరు వదులుతున్నారు. కాల్వ వెంట ఉన్న తూములకు షట్టర్లు సరిగా లేకపోవడంతో డి–6 కాల్వకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. సాగునీరు అందుతుందనే ఆశతో 11 ఎకరాల్లో వరి సాగుచేశా. అధికారులు ఈ నెల 15 వరకే సాగునీరు వదులుతామంటున్నారు. పంట చేతికి అందాలంటే మరో 5 తడులు ఇవ్వాలి. లేదంటే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.
– దేవేంద్రం, రైతు, ఆరేపల్లి (ఆత్మకూర్)
నీటి చౌర్యంతోనే..
జూరాల ఎడమ కాల్వ కింద 4 ఎకరాల్లో వరి సాగుచేశా. వారంలో నా లుగు రోజులు సాగు నీ రు వదులుతున్నామంటూ మిగిలిన రోజుల్లో దిగు వకు తరలిస్తున్నారు. ఇలాంటి నీటి చౌర్యంతోనే ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోతోంది.
– బాలస్వామి, రైతు, ఆరేపల్లి (ఆత్మకూర్)
ఇబ్బంది లేదు..
ప్రస్తుతం ప్రాజెక్టులో ఎంబీ ఎడీడీఎల్ స్థాయికిపైన 1.486 టీఎంసీలు ఉండగా.. లైవ్‌లో 0.442 టీఎంసీలు ఉన్నాయి. వేసవిలో తాగునీటి కోసం అర టీఎంసీ నీళ్లు అవసరం. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటితో తాగునీటి అవసరాలకు సరిపోతాయి. అదేవిధంగా కుడి, ఎడమ కాల్వ పరిధిలోని పంటలకు ఈ నెల 15 వరకు సాగునీటిని విడుదల చేస్తాం. – రహీముద్దీన్,
ఎస్‌ఈ, సాగునీటి పారుదల శాఖ
●


