పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రధానమైన ఏదుల, వట్టెం, ఉదండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి చేశామని.. ప్రభుత్వం దృష్టి సారించి సరిగ్గా నెలరోజులు పనిచేస్తే 35 టీఎంసీల నీరు రైతులకు అందుబాటులోకి వస్తుందని మాజీ మంత్రి వివరించారు. ఇప్పటికే మూడు సీజన్లు వృథా అయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కించి కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుబంధు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ సైతం అసమగ్రంగా అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోమారు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు.


