ప్రభుత్వ వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు

Apr 8 2026 7:50 AM | Updated on Apr 8 2026 7:50 AM

వనపర్తి: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం పార్ట్‌–1లో రాష్ట్రంలోనే ఉత్తమ ఉత్తీర్ణత శాతం సాధించారు. ఈ సందర్భంగా కళాశాలకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు లభించింది. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలలు తమ తమ విభాగాల్లో సాధించిన ఫలితాలకు గుర్తింపుగా ప్రిన్సిపాళ్లకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. స్థానిక వైద్య కళాశాల తరఫున ప్రిన్సిపాల్‌ డా. పి.మల్లికార్జున్‌, సూపరింటెండెంట్‌ డా.అరుణ అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులు, ప్రిన్సిపాల్‌, అధ్యాపక బృందాన్ని అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం పార్ట్‌–1లో ఉత్తమ ఫలితాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement