‘దమ్ముంటే పట్టుకోరా’.. ఓఆర్‌ఆర్‌పై జంటల బైక్ స్టంట్స్ | Two-Wheelers Spotted on ORR Safety Concerns Raised | Sakshi
Sakshi News home page

‘దమ్ముంటే పట్టుకోరా’.. ఓఆర్‌ఆర్‌పై జంటల బైక్ స్టంట్స్

Apr 14 2026 7:33 AM | Updated on Apr 14 2026 7:33 AM

Two-Wheelers Spotted on ORR Safety Concerns Raised

మణికొండ: ఔటర్‌రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పై రెండు జంటలు ద్విచక్ర వాహనాలపై హల్‌చల్‌ చేశాయి. ఓఆర్‌ఆర్‌ నిర్వహణ సంస్థ నిర్వాహకులకు, ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులకు సవాల్‌ విసిరాయి. వాస్తవానికి ఓఆర్‌ఆర్‌పై ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉండదు. కానీ, నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పోలీస్‌ అకాడమీ వైపు నుంచి పుప్పాలగూడ(నానక్‌రాంగూడ) టోల్‌గేట్‌ వైపు రెండు ద్విచక్ర వాహనాలపై రెండు జంటలు సోమవారం రాత్రి ప్రయాణిస్తుండగా అటుగా వెళుతున్న వారు వీడియో తీసి ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేయటంతో అది వైరల్‌ అయింది. 

దానికి అనేకమంది అనేక రకాలుగా కామెంట్‌లు పెడుతున్నారు. ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్‌’అనే కామెంట్‌కు అత్యధిక లైక్‌లు వచ్చాయి. దాంతో ఓఆర్‌ఆర్‌ నిర్వహణ సంస్థతోపాటు నార్సింగి ట్రాఫిక్, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. వీడియో ఆధారంగా రెండు వాహనాల నెంబర్‌లను గుర్తించి  చర్యలకు ఉపక్రమించారు. అక్కడున్న టోల్‌గేట్‌ సిబ్బంది ఎందుకు ఆపలేదనే విషయాన్ని వ్యవస్థలు పరిశీలిస్తున్నాయి. వాహదారులతోపాటు టోల్‌ గేట్‌ సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement