రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత

Nov 20 2024 12:33 AM | Updated on Nov 20 2024 12:33 AM

రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత

రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత

ఎచ్చెర్ల క్యాంపస్‌: భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్‌ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మంగళవారం రాజ్యాంగ పరిరక్షణ పోరాటానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. రాజ్యాంగం మార్పు, నిర్వీర్యానికి ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి ఉపాధ్యక్షులు మిస్కా కృష్ణయ్య, టి.రమణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement