
సీజేఐపై దాడి యత్నం గర్హనీయం
నెల్లూరు (లీగల్): సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి యత్నం గర్హనీయమని ఖండిస్తూ నెల్లూరు బార్ అసోసియేషన్ సభ్యులు బుధవారం కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వాదాన్ని, న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అయ్యపరెడ్డి, నాగరాజయాదవ్ మాట్లాడుతూ భవిష్యత్‌లో ఇటువంటి చర్యలకు మరొకరు పాల్పడకుండా చర్యలు ఉండాలని, సీజేఐపై దాడి యత్నం అనైతిక చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి రాజేష్, స్వర్ణ ప్రసాద్, మహిళా న్యాయవాదులు లత శ్రీనివాస్, భ్రమరాంబిక తదితరులు పాల్గొన్నారు.
రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటుకు రండి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరురూరల్: వ్యర్థాలను విలువైన సంపదగా మార్చేందుకు రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రా వాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా పరిశ్రమలశాఖ, పర్యావరణ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ ప్రతి రోజూ 350 టన్నుల తడి, పొడి వ్యర్థాలను నెల్లూరు నగరపాలక సంస్థ సేకరిస్తుందని, ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ ప్లాంట్ల ద్వారా విలువైన సంపదగా తయారు చేయొచ్చన్నారు. ప్రభుత్వ పరంగా పరిశ్రమల ఏర్పాటుకు సబ్సిడీలు, అనుమతులు సకాలంలో అందించి ప్రోత్సహిస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతోపాటు యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్‌న్ డాక్టర్ పి. కృష్ణయ్య మాట్లాడుతూ చెత్త నుంచి ఐరన్, ప్లాస్టిక్, పేపర్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వేరు చేసి రీసైక్లింగ్ ప్లాంట్ల ద్వారా తిరిగి వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. తొలుత పరిశ్రమలశాఖ ద్వారా పారిశ్రామికవేత్తలకు రీసైక్లింగ్ యూనిట్లు, బయోడిగ్రేడబుల్ ప్లాంట్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను ఇండస్ట్రీస్ జీఎం మారుతీప్రసాద్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వైఓ నందన్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ అశోక్‌కుమార్, పరిశ్రమలశాఖ అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

సీజేఐపై దాడి యత్నం గర్హనీయం