
మాజీ ఉపరాష్ట్రపతితో కలెక్టర్ మర్యాద పూర్వక భేటీ
వెంకటాచలం: మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు జిల్లా పర్యటనలో భాగంగా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం మర్వాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో పరిస్థితులు, పాలనాంశాలు, ఇతర అంశాలపై కొద్ది సేపు చర్చించారు.
జగన్ సమీక్షలో కాకాణి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
నేరాలను కట్టడి చేయాలి
● పోలీసు అఽధికారులను ఆదేశించిన ఐజీ
నెల్లూరు (క్రైమ్): నేరాలను కట్టడి చేసి ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలు అందించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఆయన ఎస్పీ అజితతో కలిసి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. రౌడీషీటర్లను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించరాదని, వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. గంజాయిని పూర్తిగా కట్టడి చేయాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నేర నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయని, వాటి ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసి ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చొరవ చూపాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను విశ్లేషించి బ్లాక్ స్పాట్‌ల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.
నేడు న్యాయవాదుల
కోర్టు విధుల బహిష్కరణ
నెల్లూరు (లీగల్): సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై కోర్టు హాల్‌లో న్యాయవాది షూ విసిరిన ఘటనను ఖండిస్తూ బుధవారం కోర్టు విధులను బహిష్కరిస్తున్నామని బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అయ్యప రెడ్డి, నాగరాజయాదవ్ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కమిటీ సమావేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌పై జరిగిన అమానవీయ ఘటన పూర్తిగా న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. ఈ ఘటనను ఖండిస్తూ అందుకు నిరసనగా బుధవారం కోర్టు విధులను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు సహకరించాలని కోరారు.
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 76,773 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,100 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.16 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. టైంస్లాట్ దర్శన టికెట్లు లేని వారికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

మాజీ ఉపరాష్ట్రపతితో కలెక్టర్ మర్యాద పూర్వక భేటీ

మాజీ ఉపరాష్ట్రపతితో కలెక్టర్ మర్యాద పూర్వక భేటీ