
భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తాం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
కందుకూరు: ఇండోసోల్ కంపెనీ కోసం భూమిలిచ్చిన రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. భూములిచ్చిన రైతులతో మంగళవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సమా వేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇండోసోల్ కంపెనీ భూసేకరణలో భూములు కోల్పోతున్న ఉప్పరపాళెం, రామకృష్ణాపురం, ఉలవపాడు, చేవూరు, రావూరు, కరేడు గ్రామా ల రైతులతో మాట్లాడుతామన్నారు. రైతుల అభిప్రాయాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి నెగోషియేషన్ కమిటీ ద్వారా భూములిచ్చిన రైతులకు ఎంత మేర నగదు చెల్లించాల్సి ఉందో చర్చించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ హిమవంశీ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రాజశేఖర్, ఏపీఎంఐపీ జోనల్ మేనేజర్ శివకుమార్ పాల్గొన్నారు.