శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో తలమునకలయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న ప్రతిపక్షనేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో నేరస్తులు, అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నారు. దీంతో నేరస్తులు చెలరేగిపోతున్నారు.
అయితే పోలీసులు మాత్రం ప్రజల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నామనీ, బీట్‌లు పెంచామనీ, డ్రోన్లతో నిఘా పెట్టామని చెబుతున్నప్పటికి ఏ మాత్రం తగినంత భరోసా దొరకడం లేదు. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.