
బైక్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
సోమశిల: బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతసాగరం మండల పరిధిలోని మినగల్లు సమీపంలో గల ప్రధాన రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని కొత్తపల్లికి చెందిన చిలకా కృష్ణారెడ్డి తన బైక్‌పై ఆత్మకూరువైపు నుంచి వస్తున్నారు. ఇదే సమయంలో కాకూరువారిపల్లికి చెందిన సుబ్బారెడ్డి (65), వెంకటసుబ్బారెడ్డి మినగల్లులో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లి తిరిగి నడుచుకొని బయల్దేరారు. ఈ తరుణంలో మినగల్లు సమీపంలోని సచివాలయం వద్ద బైక్ ఢీకొనడంతో సుబ్బారెడ్డి తలకు బలమైన గాయమైంది. హాస్పిటల్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందారు. వెంకటసుబ్బారెడ్డి స్వల్పంగా గాయపడగా, బైక్‌పై ఉన్న కృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స నిమిత్తం ఆత్మకూరు హాస్పిటల్‌కు.. ఆపై మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరులోని వైద్యశాలకు తరలించారు. సుబ్బారెడ్డి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సూర్యప్రకాష్‌రెడ్డి తెలిపారు.