
అంగన్‌వాడీ కేంద్రాలకు మరమ్మతులు
● ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్
నెల్లూరు(పొగతోట): ‘జిల్లా పరిషత్ నుంచి 15 శాతం నిధులు అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులకు మంజూరయ్యాయి. పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి’ అని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ ఆదేశించారు. శుక్రవారం నెల్లూరులోని ఐసీడీఎస్ కార్యాలయంలో ఆమె సీడీపీఓలతో సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రాల్లో పౌష్టికాహారం నాణ్యతగా లేకుంటే సమాచారం ఇవ్వాలన్నారు. తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. పిల్లలు బరువు, ఎత్తు పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యకర్తలకు సంబంధించి రిటైర్మెంట్, మరణించిన అనంతరం వచ్చే బెనిఫిట్స్ పెండింగ్ ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు. ఐసీడీఎస్ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్రాల్లో ఉండే బాలలకు సర్టిఫికెట్లు అందజేయాలన్నారు. ఈనెల 6, 7, 8 తేదీల్లో నీతి ఆయోగ్ ద్వారా ఎంపికై న కేంద్రాల పరిశీలనకు అధికారులు వస్తారన్నారు.