
15 నుంచి నిరవధిక సమ్మె
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 8న చలో తిరుపతి సీఎండీ కార్యాలయం, 15వ తేదీన నిరవధిక సమ్మె చేస్తామని ఏపీ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు జేఏసీ యాక్షన్ కమిటీ నాయకుడు షేక్ అల్తాఫ్ తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని దర్గామిట్టలోని ఏపీఎస్పీడీసీఎల్ అతిథి భవనంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సమస్యల్ని యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. సమ్మెకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, దామోదర్, నజీర్‌ఖాన్, వెంకటేశ్వర్లు, హజరత్‌వలీ, కృష్ణ, ప్రసాద్, పతంజలి, తదితరులు పాల్గొన్నారు.