లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో బుధవారం ఎన్టీఆర్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. రామవరప్పాడు రింగ్ సమీపంలోని కరెన్సీనగర్ ఎం కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే ఈ సమావేశంలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్లమెంటు పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి పాల్గొని పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.
జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు హాజరు కావాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కోరారు.