
దుర్గమ్మ దసరా హుండీ ఆదాయం రూ.10.30కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల్లో భక్తులు హుండీల ద్వారా రూ.10.30కోట్లను సమర్పించారు. ఉత్సవాల్లో అమ్మవారికి సమర్పించిన కానుకల లెక్కింపు మంగళవారంతో పూర్తయింది. తొలిరోజున రూ.3,57,92,708నగదు, 122 గ్రాముల బంగారం, 9.7కిలోల వెండి లభ్యమవగా.. రెండో రోజు రూ.6,73,02,813నగదు, 265 గ్రాముల బంగారం, 9.750కిలోల వెండి లభ్యమైంది. దసరా ఉత్సవాల్లో హుండీల ద్వారా 480 సంచులతో దుర్గమ్మకు కానుకలు వచ్చాయి. వీటిని లెక్కించగా రూ.10,30,95,521నగదు, 387గ్రాముల బంగారం, 19.450 కిలోల వెండి లభ్యమైంది. గతేడాది కంటే దాదాపు కోటి రూపాయలు హుండీల ద్వారా అదనంగా లభించింది.