
పెనమలూరు సర్పంచ్‌గా భాస్కరరావు కొనసాగింపు
పెనమలూరు: పెనమ లూరు సర్పంచిగా లింగా ల భాస్కరరావును కొనసాగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. పెనమలూరు సర్పంచి లింగాల భాస్కరరావు గ్రామంలోని పల్లిపేట కాలువ కట్టపై సిమెంట్ రోడ్డు నిర్మించారు. అయితే దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అందటంతో జిల్లా పంచాయతీ అధికారి విచారించారు. ఇరిగేషన్ శాఖ అనుమతులు లేకుండా రోడ్డు వేశారని అభియెగాలు చూపు తూ డీపీవో నివేదిక ఇచ్చారు. దీంలో కలెక్టర్ గత మే నెలలో సర్పంచి భాస్కర రావును 3 నెలలు సస్పెండ్ చేసి చెక్‌పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై భాస్కరరావు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు అప్పీల్‌కు వెళ్లారు. అయితే అప్పీల్ పెండింగ్‌లో ఉంచి ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో సర్పంచి హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ వేశారు. కోర్టు ఈ ఘటనపై పూర్తి విచారణ చేసింది. సర్పంచి సస్పెన్షన్ చేసి మూడు నెలలు గడిచినా ఎటువంటి విచారణ చేయకుండా సస్పెన్షన్ కొనసాగించటం సరైన చర్యకాదని కోర్టు భావించింది. సర్పంచిగా లింగాల భాస్కరరావును కొనసాగించి, అఽధికారాలు ఇస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సర్పంచిగా భాస్కరరావు బాధ్యతలు చేపట్టారు.
హైకోర్టు ఉత్తర్వులు జారీ