షార్ట్ సర్క్యూటే కారణమా?
గోదాములో సంభవించిన ఈ అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. గోదాములోని ఆఫీసు రూమ్ వద్ద విద్యుత్ బాక్స్‌ల నుంచి నిప్పు రవ్వలు రాలి పడటంతో మంటలు అంటుకుని ఉంటాయని భావిస్తున్నారు. మరో పక్క ఈ ప్రమాదానికి ఉద్దేశపూర్వకంగా అదృశ్య శక్తులు మరెవరైనా కారణమై ఉంటారన్న అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. ఆఫీస్ కార్యాలయంలోని రికార్డులు, స్టాక్ వివరాలు అగ్నికి ఆహుతవ్వడంతో ఎంత నష్టం జరిగి ఉంటుందని పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోతున్నారు. సమాచారం అందుకున్న విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గోదాము మేనేజర్, యజమానితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ ఘటన పై పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


