సాయితేజ్, వేద జలంధర్ జోడీగా నటించిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. వి. మునిరాజు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నిర్మించారు. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వి.మునిరాజు విలేకరులతో మాట్లాడుతూ–‘‘దర్శకుడు కావాలనే కలతో
ఇండస్ట్రీకి వచ్చి, ఆన్‌లైన్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించాను. కొద్ది రోజుల తర్వాత మా ఊరు తిమ్మరాజుపల్లికి వెళ్లి అక్కడి ప్రజలతో ఓ డెమో సినిమా చేశాను. ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్‌లో ఉండగా కిరణ్ అబ్బవరంగారితో పరిచయం ఏర్పడింది.
నా డెమో మూవీ గురించి ఆయనకు చెప్పాను. పూర్తిస్థాయిలో కథ డెవలప్ చేశాక ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రారంభం అయింది. ఇది ప్రతి ఊరి కథ. తిమ్మరాజుపల్లి అనే ఊరికి తొలిసారిగా ఓ టీవీ వస్తుంది. కానీ, ఆ టీవీ మాయం అవుతుంది. ఆ టీవీ ఏమైంది? అన్నదే ఈ సినిమా కథ. మంచి సస్పెన్స్ డ్రామాతో కథనం సాగుతుంది. మన పల్లెటూరి సంస్కృతి, ఊరి ప్రజలు, అహం, భావోద్వేగం, ప్రేమ వంటి అంశాలను ఈ సినిమాలో ప్రస్తావించాను. ప్రస్తుతం నా వద్ద వైవిధ్యమైన కథలు ఉన్నాయి’’ అని చెప్పారు.


