‘సలాం బళ్లారి’తో సమస్యలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

‘సలాం బళ్లారి’తో సమస్యలు పరిష్కారం

May 30 2025 1:22 AM | Updated on May 30 2025 1:22 AM

‘సలాం బళ్లారి’తో సమస్యలు పరిష్కారం

‘సలాం బళ్లారి’తో సమస్యలు పరిష్కారం

ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి

బళ్లారిఅర్బన్‌: నగరంలో సమస్యల పరిష్కారానికి సలాం బళ్లారి కార్యక్రమం దోహదపడుతుందని ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి పేర్కొన్నారు. సలాం బళ్లారి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూ.1200 కోట్లతో నగరంలో శాశ్వత మంచినీటి పరిష్కారానికి త్వరలో శ్రీకారం చుడుతామన్నారు. గడిగి చెన్నప్ప సర్కిల్‌ త్వరలో ప్రారంభోత్సవం చేస్తామన్నారు. సీఎం, డీసీఎంలు హాజరవుతారన్నారు. ఇంతకు ముందు తాను పర్యటించిన వార్డుల్లోని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement