మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలేదు. ‘అబద్ధం చెప్పి మోసం చేస్తే ప్రజలు మనల్ని క్షమించరు’ అని ఆయన అంటుంటారు. కూటమి ప్రభుత్వం ప్రజల్ని వంచించింది. ఆ నేతల అబద్ధపు ప్రచారాలను వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలి. డిజిటల్ బుక్ ద్వారా పాలకుల వైఫల్యాలను ఎండగట్టాలి.
– మోదుగుల వేణుగోపాల రెడ్డి,
మాజీ ఎంపీ
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతిపక్షంపై, ప్రశ్నించిన సామాన్య ప్రజలపై కక్ష సాధిస్తోంది. హామీలను అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన పోరాడాలి. పాలకులు తప్పుడు కేసులు పెడితే... రక్షించేందుకే పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈ డిజిటల్ బుక్ ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసగించినందుకు త్వరలోనే మూల్యం చెల్లించుకోక తప్పదు.
–పోతిన మహేష్,
గుంటూరు జిల్లా పరిశీలకుడు
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను అక్రమ కేసులతో అడ్డుకోవడం సాధ్యం కాదు. ప్రభుత్వం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినప్పుడే దాని పతనం ప్రారంభమైంది.
– దొంతిరెడ్డి వేమారెడ్డి,
మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త
అబద్ధాలు చెప్పలేని వ్యక్తి వైఎస్ జగన్
అబద్ధాలు చెప్పలేని వ్యక్తి వైఎస్ జగన్