
పార్టీ సైన్యమై ప్రజలకు మద్దతివ్వండి
ప్రతి నియోజకవర్గంలో గ్రామ, వార్డు స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయాలని వై.వి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 14 వేల మంది వైఎస్సార్‌సీపీ సైనికులను తయారుచేసి ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలన్నారు. కూటమి తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అరకొరగా అమలు చేసిందని పేర్కొన్నారు. త్వరలోనే నిరుద్యోగులు కూడా నెలకు రూ. 3 వేల భృతి కోసం రోడ్డు ఎక్కే పరిస్థితి ఉందని తెలిపారు. మహిళలకు ఇస్తామన్న రూ.1,500 కోసం పోరాటాలు జరుగుతాయని పేర్కొన్నారు. వారికి మద్దతు తెలిపి ప్రభుత్వం ఆయా హామీలు అమలు చేసేలా చూడాలని అన్నారు. అనంతరం డిజిటల్ స్క్రీన్‌పై ఫిర్యాదు చేసే విధానం, ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎండగట్టాలి, వార్డు, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన తీరును వివరించారు. అందుకు ముందు నాయకులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.