
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
తెనాలి రూరల్: బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టడొంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని మారిస్‌పేటలో ఉన్న సీఎం కాలనీలో ఆదివారం రాత్రి గ్యార్మీ పండుగ చేసుకున్నారు. దీనికి బాపట్ల జిల్లా అప్పికట్లకు చెందిన నాయబ్ రసూల్ (45), అతని బంధువు గౌస్‌బాషా, మరో చిన్నారి వసీం తమ కుటుంబసభ్యులతో వచ్చారు. తిరిగి సోమవారం ఉదయం అప్పికట్లకు బైక్‌పై వెళుతున్నారు. ఈ క్రమంలో తెనాలి వైకుంఠపురం నుంచి జగ్గడిగుంటపాలెం వైపు వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నాయబ్‌రసూల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ఘటనాస్థలాన్ని త్రీ టౌన్ పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు