తప్పిపోయిన చిన్నారి | - | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన చిన్నారి

May 30 2025 1:27 AM | Updated on May 30 2025 1:27 AM

తప్పిపోయిన చిన్నారి

తప్పిపోయిన చిన్నారి

మంగళగిరి టౌన్‌ ః ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయిన ఓ చిన్నారిని కేవలం గంట వ్యవధిలోనే తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన మంగళగిరిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరి అజయ్‌నగర్‌కు చెందిన తేజస్విని అనే పాప ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయి ఆర్‌టీసీ బస్టాండ్‌ వద్ద ఏడుస్తూ కనిపించింది. అదే సమయంలో విధుల్లో ఉన్న సీఐ వినోద్‌ కుమార్‌ కంటపడింది. వెంటనే చిన్నారి వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అజయ్‌నగర్‌ అని, తండ్రి పేరు విజయ్‌ అని చెప్పడంతో ఆ చిన్నారిని తీసుకుని అజయ్‌నగర్‌లోని పాప నివాసానికి వెళ్లి తేజస్విని తండ్రికి అప్పగించారు. తప్పిపోయిన చిన్నారి సురక్షితంగా ఇంటికి రావడంతో సిఐ వినోద్‌కుమార్‌కు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

గంట వ్యవధిలో తల్లిదండ్రులకు అప్పగింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement