
మాయమాటల్లో సీఎం దిట్ట
ఎన్నికల్లో అసత్య ప్రచారాలు, మాయమాటలు చెప్పటంలో చంద్రబాబు దిట్ట. మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్, అమ్మ ఒడితోపాటు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పి వంచించారు. పూట గడిస్తే చాలన్నట్లు కూటమి పరిపాలన ఉంది. ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఏ ఒక్కటీ అమలు చేయని ప్రభుత్వం ప్రపంచంలోనే కూటమి సర్కార్ మాత్రమే. 2014 –19 వరకు జరిగిన గ్రాఫిక్స్ పాలనే ఇప్పుడు కొనసాగుతోంది.
– షేక్ నూరిఫాతిమా,
నగర అధ్యక్షురాలు, వైఎస్సార్సీపీ