ఆచరణీయమైన ‘మావిగన్’వైపే ప్రజాభిప్రాయం
అమరావతి ముసుగులో దోపిడీని నిలదీసిన వైఎస్ జగన్
సమాధానాలు చెప్పలేక కూటమి ప్రభుత్వం బెంబేలు
బెడిసికొడుతున్న చంద్రబాబు పన్నాగం
అటకెక్కిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు
కూటమి ప్రభుత్వంపై సర్వత్రా వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకత
అందుకే చంద్రబాబు డైవర్షన్ పన్నాగం
వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలు.. దు్రష్పచార కుట్రలు
ఎల్లో మీడియా సహకారంతో డైవర్షన్ డ్రామా
కూటమి కుట్రలను తిప్పికొట్టిన వైఎస్సార్‌సీపీ
చంద్రబాబునుద్దేశించి ఎన్టీఆర్ సహా సొంత కుటుంబ సభ్యులు, నేతల వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ
చంద్రబాబు అభినవ ఔరంగజేబ్, గొడ్డు కన్నా హీనం..గాడ్సే కన్నా ఘోరం: ఎన్టీఆర్
కుటుంబాన్ని, ప్రజల్ని మోసగించిన చంద్రబాబు: దగ్గుబాటి వెంకటేశ్వరరావు
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణ సాధ్యమైన రాజధాని ‘మావిగన్’ ఓవైపు... ముఖ్యమంత్రి చంద్రబాబు అరచేతిలో వైకుంఠంగా చూపిస్తున్న రాజధాని అమరావతి మరోవైపు..! రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి గ్రోత్ ఇంజన్‌గా మావిగన్... రాజధాని ముసుగులో చంద్రబాబు ముఠా అవినీతికి వేదికగా అమరావతి...! రాష్ట్ర రాజధాని అంశం రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో నీళ్లు పారబోసుకోవడం అవివేకమని ప్రజలు గుర్తిస్తుండటం తాజా పరిణామం. ఆచరణ సాధ్యం కాని అమరావతి కంటే అతివేగంగా సాకారమయ్యే మావిగన్ వైపు ప్రజాభిప్రాయం మొగ్గుతోందన్నది స్పష్టమవుతుండటం ఆసక్తికరంగా మారింది.
దాంతో బెంబేలెత్తుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన శకుని మార్కు కుతంత్రాలకు బరి తెగించారు. రాజధాని అంశంలో టీడీపీ కుట్రలు బెడిసికొట్టడంతో తనదైన డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న అమరావతి ఆచరణ సాధ్యం కాదని... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదించిన రాజధానిగా ‘మావిగన్’ అందుబాటులో ఉన్న ఏకైక పరిష్కారమనే నిశ్చితాభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ప్రజల మనోగతం వెల్లడి కావడంతో బెంబేలెత్తుతున్న టీడీపీ కూటమి పెద్దలు దీని నుంచి దృష్టి మళ్లించేందుకు దిగజారుడు రాజకీయాలకు తెర తీశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు.
వాస్తవాలను వక్రీకరిస్తూ... అభూత కల్పనలను జోడిస్తూ పచ్చ మీడియా ప్రాపగాండాతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పన్నాగం పన్నుతున్నారు. చంద్రబాబు కుట్రలను వైఎస్సార్‌సీపీ సమర్థంగా తిప్పికొడుతోంది. రాజధానిగా ‘మావిగన్’ ఏ విధంగా మెరుగైనదో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దుర్బుద్ధి, కుట్రలను ఎండగడుతూ ఆయన మామ ఎన్టీ రామారావుతోపాటు ఆయన తోడల్లుడు దగ్గుబాటి, బావమరిది నందమూరి హరికృష్ణతోపాటు పలువురు నేతలు స్వయంగా చెప్పిన మాటలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పవన్ కళ్యాణ్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి తదితరులు గతంలో చంద్రబాబునుద్దేశించి చేసిన విమర్శలను ప్రస్తావిస్తున్నారు.
‘అమరావతి’ అవినీతిపై సమాధానం చెప్పలేకే...
టీడీపీ కూటమి సర్కారు రెండేళ్ల పాలనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. సున్నా వడ్డీ పథకానికి అతీ గతీ లేదు.. నాడు – నేడు పథకం అటకెక్కింది. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎగ్గొట్టారు. తల్లికి వందనం పథకం పచ్చి మోసంగా మారింది. అటు సంక్షేమ పథకాలు నిలిచిపోవడం, ఇటు అభివృద్ధి కార్యక్రమాలే లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. దాంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు హఠాత్తుగా రాజధానిగా అమరావతి తీర్మానాన్ని తెరపైకి తెచ్చారు. తద్వారా తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చాలన్నది ఆయన ఎత్తుగడ.
అయితే రాజధానిగా అమరావతి ఏ విధంగా ఆచరణ సాధ్యమో చెప్పాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. కేవలం రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు. ఇక మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మాణానికి ఏ రూ.10 లక్షల కోట్లు అవుతుందో అంతే చిక్కడం లేదన్నారు. చంద్రబాబు 2014–19లో, 2024 నుంచి ఇప్పటివరకు రాజధాని కోసం ఖర్చు చేసింది కేవలం రూ.8 వేల కోట్లేనని గుర్తు చేశారు. దీన్నిబట్టి ఆయన చెబుతున్న అమరావతి రానున్న 30 ఏళ్లలో కూడా సాధ్యం కాదన్నారు. ఇక అమరావతి నిర్మాణం పేరిట యథేచ్ఛగా పాల్పడుతున్న అవినీతిని వైఎస్ జగన్ సాక్ష్యాధారాలు, గణాంకాలతో సహా ఎండగట్టారు.
బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఇటాలియన్ మార్బుల్స్‌తో అధునాతనంగా నిర్మించే భవనాలకే చ.అడుగుకు రూ.4,500 ఖర్చు అవుతోంది. కానీ అమరావతిలో మాత్రం చ.అడుగుకు ఏకంగా రూ.14 వేలు దాకా చెల్లిస్తూ పనులు ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) దేశంలో కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున ఆరు లేన్ల రహదారులు నిర్మిస్తుంటే... అమరావతిలో మాత్రం కి.మీ.కు రూ.53 కోట్ల చొప్పున టెండర్లు ఖరారు చేయడం ఏమిటని నిలదీశారు.
అమరావతి దోపిడీ కుట్రలో భాగస్వాములైన ఈనాడు కిరణ్ వియ్యంకుడు, చంద్రబాబు బినామీ బలుసు శ్రీనివాసరావు తదితరులకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల రూపంలో భారీగా ప్రజాధనాన్ని దోచిపెడుతున్న తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణం ఏ విధంగా ఆచరణ సాధ్యమో తెలపాలని.. రాజధాని పేరుతో సాగుతున్న అవినీతిపై వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానమే లేకుండా పోయింది. దాంతో రాజధాని అమరావతి నిర్మాణం పేరిట చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ప్రజలకు స్పష్టమైంది. అమరావతి పేరిట భారీగా అవినీతికి పాల్పడుతున్నారన్నది బహిర్గతమైంది. 
‘మావిగన్’కు ప్రజామోదం..
రాష్ట్ర రాజధానిగా వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ పట్ల రాష్ట్రవ్యాప్తంగా సానుకూల అభిప్రాయం బలపడుతోంది. పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల పరంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ‘మావిగన్’ గ్రోత్ ఇంజన్‌గా నిలుస్తుందని స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన 110 కి.మీ. అర్బన్ ప్రాంతం, అంతర్జాతీయ విమానాశ్రయం, బందరు పోర్టు, పూర్తి కనెక్టివిటీ ఉన్న జాతీయ రహదారులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్నత విద్యా సంస్థలతో మావిగన్ రాజధానిగా అత్యంత అనుకూలమనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే రూ.2 లక్షల కోట్లు కావాల్సి ఉండగా... కేవలం రూ.20వేల కోట్లతో మావిగన్‌ను పూర్తిస్థాయి రాజధానిగా తీర్చిదిద్దవచ్చన్నది స్పష్టమవుతోంది.
‘మావిగన్’కు వ్యతిరేకంగా టీడీపీ తమ సోషల్ మీడియా విభాగం ద్వారా చేసిన అవహేళన, దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. దాంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు తనదైన శైలిలో మరోసారి క్రెడిట్ చోరీకి యత్నించి భంగపడ్డారు. తాము ప్రతిపాదించిన అమరావతిలో మావిగన్ ఒక భాగమని నమ్మించేందుకు యత్నించారు. కానీ కూటమి ప్రభుత్వం గాలిలో మేడలు కడుతున్న అమరావతి వేరు... వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణ సాధ్యమైన మావిగన్ వేరని ప్రజలు గుర్తించారు. చంద్రబాబు మాటలను ఏమాత్రం విశ్వసించడం లేదని నిఘావర్గాలు కూడా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.

అందుకే చంద్రబాబు ‘దుష్ప్రచార’ కుతంత్రం...
అమరావతిపై తన కట్టుకథలు బెడిసికొడుతుండటం... మావిగన్‌కు అనుకూలంగా ప్రజాభిప్రాయం బలపడుతుండటంతో చంద్రబాబు తన మార్కు కుతంత్రాలకు పదును పెట్టారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన కపట నైజాన్ని గుర్తు చేస్తున్నాయి. ‘2009 ఎన్నికల అనంతరం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను..!’ అని హెచ్చరించడం గమనార్హం. అనంతరం అనుమానాస్పద రీతిలో హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణం చెందడం సందేహాలను బలపరుస్తోంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు మరోసారి తన మార్కు దుర్బుద్ధిని ప్రదర్శించారు. అమరావతి పేరిట తాము సాగిస్తున్న అవినీతి బట్టబయలు కావడంతో మరోసారి తన పన్నాగానికి పదును పెట్టారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కించపరుస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు దుష్ప్రచారానికి తెగబడ్డారు. వాస్తవాలను వక్రీకరిస్తూ... అభూత కల్పనలను జోడిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు టీడీపీ దుష్ప్రచారానికి తెరతీసింది. మంత్రి అచ్చెన్నాయుడు మొదటగా ఈ కుట్రను లేవనెత్తగా... మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఆ కుట్రలో పాత్రధారులుగా మారారు.
చంద్రబాబు రాజకీయ స్వార్థం, కుట్రలు, కుతంత్రాలు, దిగజారుడు రాజకీయాలు, బరితెగించి సాగించిన అవినీతి గురించి గతంలో పలువురు చేసిన విమర్శలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సొంత మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వైస్రాయ్ కుట్ర ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు గురించి ఎన్టీ రామారావు, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది నందమూరి హరికృష్ణ, సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడులతోపాటు పలువురు సీనియర్ నేతలు గతంలో చేసిన విమర్శలను సామాన్యులు సైతం చర్చించుకుంటున్నారు.
బాబు నైచ్యానికిదే నిదర్శనం!
2009 ఆగస్టులో వైఎస్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన నైచ్యానికి అద్దంపడుతున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను’’ అని చంద్రబాబు హెచ్చరించడం, ఆ తర్వాత రోజే అనుమానాస్పద రీతిలో వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
చంద్రబాబు డర్టీయెస్ట్ పొలిటీషియన్
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్
దేశంలోనే డర్టీయెస్ట్ రాజకీయ నాయకుడు.. ఆయన నాయకుడు కాదు.. మేనేజర్ మాత్రమే.. కాపీ క్యాట్..! ఆయనకు ఆదర్శాలు లేవు.. స్వార్థం మాత్రమే
⇒ డిసెంబర్ 30, 2018 ప్రెస్ మీట్‌లో ‘హైదరాబాద్‌ను ప్రపంచ మ్యాప్‌పై పెట్టానని చంద్రబాబు అంటాడు.. మెంటల్..!
అంత సమర్థుడైతే అమరావతి ఎందుకు కట్టలేదు? గ్రాఫిక్స్ తప్ప నిజమైన భవనాలు ఏవీ రాలేదు.
⇒ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో నవంబర్ 25, 2018 పరిగి (వికారాబాద్) బహిరంగ సభ, ప్రెస్‌మీట్‌లో..
హత్యా రాజకీయాలే బాబు బ్రాండ్!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబే అన్నది నిర్వివాదాంశమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ అక్రమాలకు అడ్డుగోడగా ఉన్నారనే 1988లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగాను హత్య చేయించారని, ఇందుకు నాటి హోంమంత్రి కోడెల శివ ప్రసాద్ ద్వారా కుట్ర పన్నారని చెబుతున్నారు. రంగా హత్యలో స్వయంగా పాల్గొన్న వెలగపూడి రామకృష్ణకు 2009లో, 2024లో చంద్రబాబు విశాఖ తూర్పు నియోజకవర్గ టికెట్ ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. 1985లో ఎన్టీఆర్‌పై హత్యాయత్నం చేసిన మల్లెల బాబ్జీ.. విజయవాడలో అనుమానాస్పద స్థితిలో చనిపోవడం వెనుక వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ కుట్రలో సూత్రధారులు పేర్లు బయట పడకూడదనే మల్లెల బాబ్జీని అంతం చేశారని స్పష్టం చేస్తున్నారు.
టీడీపీ అక్రమాలను ప్రశ్నిస్తున్న ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథ రామ్‌ను విజయవాడలో నడిరోడ్డుపై హత్య చేయడం వెనుక కుట్రదారు చంద్రబాబేనని సోషల్ మీడియాలో ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వైఎస్ రాజారెడ్డిని 1998లో టీడీపీ వర్గీయులు హత్య చేశారు. ఆ కేసులో నిందితులు ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నారు. వైఎస్ రాజారెడ్డి హత్య అనంతరం నిందితులకు చంద్రబాబు ప్రభుత్వమే హైదరాబాద్‌లో నెల రోజులపాటు ఆశ్రయం ఇవ్వడం గమనార్హం. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచకం బీభత్సం సృష్టిస్తోంది. 21 నెలల్లోనే 21 రాజకీయ హత్యలకు తెగబడ్డారని, చంద్రబాబు అధికారం చేపట్టాక రాష్ట్రంలో 710 హత్యలు జరగడం దారుణంగా దిగజారిన శాంతిభద్రతల దుస్థితికి నిదర్శనమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
చంద్రబాబు తిరుపతి రైల్వే స్టేషన్‌లో జేబులు కొట్టేవాడు..!
-నాదెండ్ల భాస్కర్‌రావు, మాజీ ముఖ్యమంత్రి
చంద్రబాబు పచ్చి అవినీతిపరుడు. దిగజారుడు వ్యక్తి. రాజకీయాల్లోకి రాకముందు తిరుపతి రైల్వే స్టేషన్‌లో జేబులు కొట్టేవాడని మాకు రిపోర్ట్ వచ్చింది. అటువంటి వ్యక్తి ఇక రాజకీయాల్లోకి వస్తే ఎంతగా దిగజారి ప్రవర్తిస్తాడో ఊహించుకోండి. చంద్రబాబు అలానే దిగజారుడు, అవినీతి రాజకీయాలే లక్ష్యంగా పని చేస్తున్నాడు.
చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయం...
-పవన్ కళ్యాణ్, టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి
(గతంలో చంద్రబాబుపై చేసిన విమర్శలు)
చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయంగా మారింది. రాజధాని అమరావతి, కోస్టల్ కారిడార్ పేరుతో అవినీతికి పాల్పడుతోంది. రాష్ట్రంలో భూములు, గనులు, ఇసుక కుంభకోణాలు పెచ్చుమీరుతున్నాయి. లోకేశ్ నా తల్లిని దూషించారు. ఖబడ్దార్...!
చంద్రబాబు ఔరంగజేబ్... గొడ్డుకన్నా హీనం... గాడ్సే కన్నా ఘోరం: ఎన్టీరామారావు
‘రాజ్యాధికారం కోసం తండ్రిని జైల్లో పెట్టిన, సోదరుడిని హత్య చేసిన ఔరంగజేబ్ వంటి వాడు చంద్రబాబు. తెలుగు జాతి చరిత్రలో అభినవ ఔరంగజేబ్ చంద్రబాబు. నాతోనే ఉంటూ పథకం ప్రకారం వెన్నుపోటు పొడిచాడు. గుండెల మీద తన్నాడు. చంద్రబాబు గొడ్డుకన్నా హీనం... గాడ్సే కన్నా ఘోరం. చంద్రబాబు దశమ గ్రహం. 
కుటుంబాన్నీ, ప్రజలను మోసం చేసిన కుట్రదారు చంద్రబాబు
-దగ్గుబాటి వెంకటేశ్వర రావు
‘అడ్డదారిలో అధికారాన్ని దక్కించుకునేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు. అందుకోసం 1995లో వైస్రాయ్ హోటల్ కుట్ర ద్వారా ఇటు కుటుంబాన్ని, అటు రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. అధికారం, అవినీతే చంద్రబాబు లక్ష్యాలు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంట్రాక్టర్లు, బడా పారిశ్రామికవేత్తలకు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు ఇప్పించి యథేచ్చగా అవినీతికి పాల్పడేవారు. 1985ృ89 ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో మద్యం డిస్టిలరీల లైసెన్సు ఇప్పిస్తానని తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి గోనె సంచిలో కోట్ల రూపాయలు తీసుకువచ్చి ఇచ్చారు. విద్యుత్ ప్లాంట్ల లైసెన్సుల మంజూరులో అవినీతికి పాల్పడితే ఎన్టీ రామారావు తీవ్రంగా మందలించారు. అయినా సరే గోతికాడ నక్కలా కాచుకుని వెన్నుపోటు పొడిచారు.
రంగా హత్య వెనుక చంద్రబాబు
-మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య
(‘అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం’ పుస్తకంలో పేర్కొన్నారు) ప్రజా నాయకుడు, విజయవాడ ఎమ్మెల్యేగా ఉన్న వంగవీటి మోహన రంగా హత్య వెనుక ప్రధాన కుట్రదారు చంద్రబాబే. ఆయన ప్రోద్బలంతోనే రంగాను హత్య చేశారు. రంగా జీవించి ఉంటే టీడీపీకి మనుగడ ఉండదని భావించారు. అందుకే రంగా హత్యకు పచ్చ జెండా ఊపారు.’ 
చంద్రబాబు అరాచక శక్తి
-దేవినేని నెహ్రూ, మాజీ మంత్రి
‘అధికారం కోసం చంద్రబాబు ఎంతటి అరాచకానికైనా పాల్పడతారు. 1994లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావును, ఆయన కుమారుడు హరికృష్ణను మా ముందే పచ్చి బూతులు తిట్టారు. ఇక వైస్రాయ్ హోటల్ కుట్రతో ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా పార్టీ నిర్వహించే ధర్నాల సందర్భంగా బస్సులను దహనం చేయాలని కార్యకర్తలను ఆదేశించారు. సామాన్య ప్రయాణికులు చనిపోతారని కార్యకర్తలు చెప్పినా సరే ఆయన వినిపించుకునేవారు కాదు. సామాన్యులు చనిపోతే మనకేం... బస్సులు తగలబెట్టకపోతే పార్టీ కార్యక్రమాలు విజయవంతం అయినట్టు కాదు అని చంద్రబాబు చెప్పేవారు. అంతటి అరాచక శక్తి చంద్రబాబు.
అవినీతి, అక్రమాల్లోనే చంద్రబాబు సీనియర్
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
(2019 ఎన్నికల సందర్భంగా గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం ఎన్నికల సభల్లో ప్రసంగిస్తూ) 
‘అద్భుతమైన రాజధాని అంటూ చంద్రబాబు అక్రమ సంపాదన ఆర్జనలో బిజీ అయిపోయారు. ఆయన చేస్తోంది రాజధాని నిర్మాణం కాదు.. కూలి పోతున్న టీడీపీ నిర్మాణం. అమరావతి, పోలవరం ప్రాజెక్టు సహా అన్నింటిలోనూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ దోపిడీకి పాల్పడుతున్నారు. సొంత హెరిటేజ్ కంపెనీ కోసమే ఆయన తపన అంతా. పోలవరం ప్రాజెక్టును తన అవినీతికి ఏటీఎంగా చేసుకున్నారు. ప్రజల్ని మోసగించేందుకు డేటా చోరీకి పాల్పడ్డారు. చంద్రబాబు తాను సీనియర్‌నని చెప్పుకుంటారు. కానీ సొంత మామకే వెన్నుపోటు పొడవటంలో ఆయన సీనియర్. తెలుగు ప్రజలను మోసం చేయడంలో సీనియర్. నేడు తిట్టిన పార్టీ ఓళ్లోనే రేపు కూర్చోవడంలో సీనియర్. కేంద్ర పథకాలను తనవిగా స్టిక్కర్ వేసుకోవడంలోనే సీనియర్.’


