సాక్షి,నెల్లూరు: వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటన ఖరారైంది. ఈ నెల 15న జువ్వలదిన్నె హార్బర్‌కు వైఎస్ జగన్ వస్తున్నారని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సోమవారం తెలిపారు.
‘కూటమి ప్రభుత్వం హార్బర్‌ను ప్రైవేటు పరం చేయాలని చూస్తోంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకార సామాజిక వర్గ సమస్యకు అండగా నిలవడానికి వైఎస్ జగన్ వస్తున్నారు. జువ్వలదిన్నె హార్బర్ వైఎస్ జగన్ హయాంలో నిర్మితమైంది. జగన్ పర్యటనకు ఎన్ని ఆటంకాలు కలిగించినా విజయవంతం అవడం ఖాయం’ అని కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.


