
ముందుకు సాగని సమీకృత భవన నిర్మాణ పనులు
అనంతపురం అర్బన్: ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా సమీకృత ఆర్థిక భవనం (ఇంటీగ్రేడెట్ ఫైనాన్స్ కాంప్లెక్స్) ఏర్పాటు ప్రక్రియ ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. జిల్లాలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే ఖజానా, స్టేట్ ఆడిట్, పే అండ్ అకౌంట్స్, ఏపీజీఎల్‌ఐ శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండాలనే ఉద్ధేశంతో సమీకృత ఆర్థిక భవనం ఏర్పాటుకు 2016లోనే ఆర్థికశాఖ రూ.10కోట్ల నిధులు మంజూరు చేసింది. అనంతపురంలోని శారదానగర్‌లో ఉన్న సేవా సదనం వెనుక 50 సెంట్లు స్థలాన్ని గుర్తించారు. ఇందుకు సంబంధించి నివేదికను అప్పటి ఆర్డీఓ కలెక్టరేట్‌కు అందజేశారు. ఈ క్రమంలోనే నగర పాలక సంస్థ నుంచి ఖజానా శాఖ క్లియరెన్స్ తీసుకుంది. ఇదే సమయంలో అప్పటి కలెక్టర్ నాగలక్ష్మి బదిలీ కావడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో సమీకృత ఆర్థిక భవన నిర్మాణ అంశంలో కలెక్టర్ ఓ.ఆనంద్‌పై ఖజానాశాఖ అధికారులు, ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు.
సొంతింటి కల ఛిద్రం
అనంతపురం టౌన్: సామాన్యుల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం ఛిద్రం చేసింది. జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణ పనులు ముందుకు సాగకుండా కోర్టులను ఆశ్రయించి కుట్ర చేసింది. దీంతో ఇళ్ల నిర్మాణ పనులు మొదటి దశలోనే ఆగిపోయాయి. అనంతపురం రూరల్ మండలం కొడిమి గ్రామ పంచాయతీలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 3వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేయడంతోపాటు ఇంటి నిర్మాణ పనుల బాధ్యతను సైతం ప్రభుత్వమే తీసుకుంది. కొన్ని నిర్మాణ పనులు పూర్తి చేసింది. అనంతరం ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఇంటి నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. దీంతో పునాదుల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి.

ముందుకు సాగని సమీకృత భవన నిర్మాణ పనులు