Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

PM Modi meeting With Air Force Chief Air Marshal Amar Preet Singh1
ప్రధాని మోదీతో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ కీలక భేటీ.. ఏం జరగనుంది?

ఢిల్లీ: భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ.. జాతీయ భద్రతా సలహాదారు, ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌తో తాజాగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇక, సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ప్రధాని మోదీ.. వరస భేటీలు అవుతున్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో భేటీ అయ్యారు.ఇదిలా ఉండగా.. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే మ్యునిషన్స్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన రెండు ఆయుధ కర్మాగారాల సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లా కర్మాగారంతోపాటు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ జిల్లా ఖమరియాలో ఉన్న ఆర్డినన్స్‌ ఫ్యాక్టరీ సిబ్బందికి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.జాతీయ భద్రతతోపాటు ప్రస్తుత కీలక సమయంలోని నిర్వహణ అత్యవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రపుర్‌ జిల్లా కర్మాగారం అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోయామని, ఆ లోటును భర్తీ చేయడానికే దీర్ఘకాల సెలవులను తక్షణం రద్దు చేస్తున్నట్లు ఖమరియా ఫ్యాక్టరీ అధికారులు తెలిపారు.Indian Air Force Chief Air Marshal Amar Preet Singh is meeting Prime Minister Narendra Modi right now: Sources pic.twitter.com/qytnt88F0G— ANI (@ANI) May 4, 2025

Pakistan Again Nuclear Warning To India2
అదే జరిగితే.. భారత్‌కు పాక్‌ మరోసారి అణు బెదిరింపులు

మాస్కో: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్‌ చేపడుతున్న చర్యలు.. పాక్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తాజాగా రష్యాలోని పాక్‌ దౌత్యవేత్త మహమ్మద్‌ ఖలీద్‌ జమాలీ అణు బూచిని భారత్‌కు చూపించి బెదిరించే యత్నం చేశారు. ఒక వేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే.. అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని పేర్కొన్నారు. రష్యా ఛానల్‌ ఆర్‌టీకి ఇంటర్వ్యూ ఇస్తూ.. భారత్‌కు చెందిన బాధ్యతారాహిత్య మీడియా నుంచి వస్తున్న ప్రకటనలు మమ్మల్ని తప్పనిసరిగా స్పందించేలా చేస్తున్నాయి. ఇటీవల లీకైనట్లు చెబుతున్న పత్రాల్లో భారత్‌ కొన్ని చోట్ల కచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసింది. ఆ దేశంతో యుద్ధం విషయానికి వస్తే ప్రజల మద్దతుతో మా సంప్రదాయ, అణు బలంతో పూర్తిస్థాయిలో స్పందిస్తాం’’ అని జమాలీ పేర్కొన్నారు. గత వారం ఆ దేశ రైల్వేశాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ మాట్లాడుతూ తమ వద్ద ఉన్న ఘజన్నవీ, ఘోరీ, షహీన్‌ క్షిపణులు, 130 అణ్వాయుధాలు భారత్‌ కోసమే ఉంచినట్లు ప్రకటించారు. పాక్‌ ప్రేరిత ఉగ్రవాదులు పహల్గాంలోని బైసరన్‌ లోయలో దాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు తీయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ టెర్రరిస్టులు పాక్‌ జాతీయులని తేలింది. దీంతో భారత్‌ ప్రతిచర్యలకు దిగింది. ఇప్పటికే సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేసి ఇస్లామాబాద్‌కు భారత్‌ కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. ఉగ్రవాదులు, ఆ మూకలకు మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకొనే విషయంలో భద్రతా దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఎక్కడ, ఎప్పుడు ఎలా దెబ్బకొట్టాలో వారే నిర్ణయిస్తారన్నారు. సైనిక చర్య కూడా ఉండొచ్చన్న ఆందోళనతో.. యుద్ధం వస్తే తాము అణ్వాయుధాలు వాడతామంటూ పాక్‌ ప్రకటనలు గుప్పిస్తోంది.

RCB VS CSK: Ravindra Jadeja Smashed Longest Six Of IPL 20253
RCB VS CSK: రాకాసి సిక్సర్‌ బాదిన జడేజా.. క్లాసెన్‌, రసెల్‌ కూడా సాధ్యం కాలేదు..!

సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అత్యంత భారీ సిక్సర్‌ (109 మీటర్లు) కొట్టాడు. నిన్న (మే 3) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ ఐదో బంతికి (ఛేదనలో) లుంగి ఎంగిడి వేసిన ఫుల్‌ టాస్‌ బంతిని జడేజా స్టేడియం పైకప్పు పైకి పంపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. 109m six! 👏Ravindra Jadeja hit a MONSTROUS maximum during his fighting knock of 77*(45)! 🔥 Watch his full knock▶️ https://t.co/76RyGG8wAn#TATAIPL | #RCBvCSK | @ChennaiIPL | @imjadeja pic.twitter.com/L5Lv6291pT— IndianPremierLeague (@IPL) May 3, 2025జడేజా బాదిన ఈ సిక్సర్‌కు ముందు ఈ సీజన్‌లో అత్యంత భారీ సిక్సర్‌ రికార్డు సన్‌రైజర్స్‌ ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ పేరిట ఉండేది. క్లాసెన్‌ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 మీటర్ల సిక్సర్‌ బాదాడు. క్లాసెన్‌ తర్వాత ఈ సీజన్‌ బిగ్గెస్ట్‌ సిక్సర్ల రికార్డు ఆండ్రీ రసెల్‌, అభిషేక్‌ శర్మ పేరిట ఉంది. రసెల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌పై.. అభిషేక్‌ పంజాబ్‌పై 106 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టారు. ఈ సీజన్‌లో ఐదో భారీ సిక్సర్‌ రికార్డు ఆర్సీబీ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ పేరిట ఉంది. సాల్ట్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 105 మీటర్ల సిక్సర్‌ కొట్టాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆయుశ్‌ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో చెలరేగినా ఆర్సీబీ చేతిలో సీఎస్‌కే 2 పరుగుల స్వల్ప తేడాతో ఓడింది.చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. జేకబ్‌ బేతెల్‌ (33 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్ట్‌ (14 బంతుల్లో 53 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.సీఎస్‌కే బౌలర్లలో పతిరణ (4-0-36-3), నూర్‌ అహ్మద్‌ (4-0-26-1) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా.. ఖలీల్‌ అహ్మద్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (3-0-65-0). ఖలీల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో షెపర్డ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు. పతిరణ వేసిన చివరి ఓవర్‌లోనూ అదే జోరు కొనసాగించిన షెపర్డ్‌ ఆ ఓవర్‌లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే.. చివరి బంతి వరకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులకే పరిమితమైంది. ఆయుశ్‌ మాత్రే, రవీంద్ర జడేజా సీఎస్‌కేను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.సీఎస్‌కే గెలుపుకు చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా.. యశ్‌ దయాల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా సీఎస్‌కే లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. దయాల్‌, కృనాల్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్‌కే ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దాదాపుగా ఖరారైనట్లే.

Tension In Hindupur During Balakrishna Visit4
బాలకృష్ణ పర్యటన.. హిందూపురంలో ఉద్రిక్తత

సాక్షి, సత్యసాయి జిల్లా: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన సందర్భంగా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్ స్థూపం తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. దీంతో, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు పొందిన పార్టీ కార్యకర్తలు సన్మానం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హిందూపురం రహమత్ పూర్ సర్కిల్‌లో వైఎస్సార్ అమర్ రహే స్థూపాన్ని అధికారులు, టీడీపీ కార్యకర్తలు కలిసి తొలగించారు. అక్కడ బాలకృష్ణ ఫ్లెక్సీలను టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. దీంతో, వైఎస్సార్ స్థూపం తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, హిందూపురంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి.. రహమత్‌ పూర్‌ సర్కిల్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో, వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Minister Bandi Sanjay Sensational Comments On Maoists5
మావోయిస్టులతో మాటల్లేవు... మాట్లాడుకోవడాల్లేవ్: బండి సంజయ్‌

సాక్షి, కరీంనగర్‌: మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదు అని స్పష్టం చేశారు. మావోయిస్టులతో మాటల్లేవు... మాట్లాడుకోవడాల్లేవ్ అంటూ వ్యాఖ్యలు చేశారు.కరీంనగర్‌లోని కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టనపెట్టుకున్నోళ్లతో చర్చలు ఉండవ్. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్. బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ సహా ఎంతో మంది నాయకులను మందుపాతరలు పెట్టి చంపినోళ్లు నక్సల్స్. అమాయక గిరిజనులను ఇన్ ఫార్మర్ల నెపంతో అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చినోళ్లు మావోయిస్టులు. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదుకేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకం. ఇది కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరం. కాంగ్రెస్ కులగణన సర్వేకు, మోదీ కులగణను పొంతనే ఉండదు. కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. బీసీల జనాభాను తగ్గించి చూపారు. కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదు. ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోంది.పాస్ పోర్టు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నాం. రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినా చర్యలెందుకు తీసుకోవడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. ఆ రెండు పార్టీలు సిగ్గు లేకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీలు పడుతున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

coin sized nuclear battery with a 50 year lifespan6
ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 50 ఏళ్లు వచ్చే బ్యాటరీ

ఒకసారి ఛార్జ్‌ చేస్తే యాభై సంవత్సరాలు నిరాటంకంగా పని చేసేలా కాంపాక్ట్‌ న్యూక్లియర్‌ బ్యాటరీలను రూపొందిస్తున్నట్లు చైనీస్‌ బ్యాటరీ తయారుదారు బీటెవోల్ట్‌ ప్రకటించింది. ఇది కాంపాక్ట్ న్యూక్లియర్ ఎనర్జీలో పురోగతిని సూచిస్తుంది. బీవీ 100 నికెల్-63 ఐసోటోపులను ఉపయోగించి రేడియోధార్మికత ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. డైమండ్ సెమీకండక్టర్ల ద్వారా ఈ చర్యలో విడుదలైన శక్తిని విద్యుత్తుగా మారుస్తున్నట్లు పేర్కొంది.బీవీ 100 న్యూక్లియర్ బ్యాటరీ ఫీచర్లుపరిమాణం: ఒక చిన్న నాణెం (15x15x5 మిమీ) పరిమాణంలో ఉంటుంది.పవర్ అవుట్ పుట్: 3 వోల్ట్‌ సామర్థ్యం ఉన్న బ్యాటరీ 100 మైక్రోవాట్ల పవర్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ ఏడాది చివరి నాటినికి 1 వాట్ పవర్‌ను ఉత్పత్తి చేసే బ్యాటరీలను తయారు చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది.జీవితకాలం: ఈ న్యూక్లియర్‌ బ్యాటరీ ఒకసారి ఛార్జింగ్ చేస్తే మళ్లీ ఛార్జ్‌, మెయింటెనెన్స్ అవసరం లేకుండా 50 ఏళ్లు పనిచేస్తుంది.సామర్థ్యం: ప్రస్తుతం ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీల కంటే 10 రెట్లు అధికం సామర్థ్యంతో పని చేస్తాయి.ఇదీ చదవండి: పాకిస్థాన్‌ మొత్తం అప్పు ఎంతో తెలుసా..?సేఫ్టీ: విపరీతమైన ఉష్ణోగ్రతల్లో (-60°C నుంచి +120°C) మెరుగ్గా పనిచేస్తుంది. వీటివల్ల మంటలు లేదా పేలుడు ప్రమాదాలను జరగవని కంపెనీ తెలుపుతుంది. పూర్తిస్థాయిలో ఈ బ్యాటరీలు వినియోగంలోకి వచ్చిన తర్వాతే ఈ అంశంపై స్పష్టత వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఉపయోగాలు: వైద్య పరికరాలు, ఏరోస్పేస్ పరికరాలు, ఏఐ వ్యవస్థలు, డ్రోన్లు.. వంటి నిరంతరం విద్యుత్‌ అవసరమయ్యే పరికరాలకు ఈ బ్యాటరీలో ఎంతో అనువైనవిగా సంస్థ చెబుతుంది.

One Police Constable Suspended Become Actor Vijay7
హీరోపై అభిమానంతో పిచ్చి పని.. కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

భద్రతా విధుల్లో ఉండాల్సిన ఒక పోలీసు కానిస్టేబుల్‌ తన అభిమాన హీరో కోసం వెళ్లి సస్పెండ్‌ అయ్యాడు. తమిళగ వెట్రి కళగం నేత విజయన్‌ను కలిసిన పోలీసు కానిస్టేబుల్‌ కదిరవన్‌ను సస్పెండ్‌ చేస్తూ మధురై పోలీసు కమిషనర్‌ లోకనాథన్‌ ఆదేశాలు జారీ చేశారు. విజయ్‌ ప్రస్తుతం కొడైకెనాల్‌లో జన నాయగన్‌ షూటింగ్‌ బిజీలో ఉన్నారు. ఆయన కోసం అభిమానులు కొడైకెనాల్‌కు పోటెత్తుతున్నారు. అదే సమయంలో మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో కదిరవన్‌కు అక్కడ డ్యూటీ వేశారు. అయితే, భద్రతా విధులలో ఉండాల్సిన కానిస్టేబుల్‌ సెలవు పెట్టి మరీ కొడైకెనాల్‌లో పత్యక్షం కావడం చర్చకు దారి తీసింది. యూనిఫాంను పక్కన పెట్టి తానో అభిమాని అని చాటుకునే దిశగా ఆయన విజయ్‌ను కలిసి వచ్చారు. అయితే, విధులను పక్కన పెట్టినందుకు గాను కదిరవన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రజల కోసం పనిచేయాల్సిన కదిరవన్‌ తన యూనిఫామ్‌ను తొలగించి విజయ్ రాజకీయ పార్టీ కండువాను ధరించాడు. ఆపై ఆయనతో ఫోటోలు దిగాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు.

APTDC Employee CCTV Footage Viral At Vijayawada8
ఏపీటీడీసీలో ఉద్యోగి రాసలీలలు

సాక్షి, విజయవాడ: ఏపీటీడీసీ డివిజనల్‌ కార్యాలయంలో ఓ అధికారి రాసలీలల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత సదరు అధికారి.. ఓ మహిళతో ఏకాంతంగా గడిపిన విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆఫీసులో సీసీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.వివరాల ప్రకారం.. విజయవాడలోని బందరురోడ్డు వెంబడి లైలా కాంప్లెక్స్‌లో ఏపీటీడీసీ డివిజనల్‌ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి రాసలీలల వ్యవహారం బయటకు వచ్చింది. సదరు ఉద్యోగి.. ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత ప్రతీ రోజూ రాత్రిపూట తన ద్విచక్రవాహనంపై ఓ మహిళను తీసుకుని ఆఫీసుకు రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే, పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగి కావటంతో సెక్యూరిటీ సిబ్బంది.. ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.రోజూ ఇలాగే చేస్తున్న క్రమంలో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఏపీటీడీసీ అధికారులకు తెలియజేశారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు.. ఆఫీసులో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం, ఆఫీసులో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించగా వారిద్దరూ అడ్డంగా దొరికిపోయారు. రాత్రి సమయంలో ఉద్యోగి బైకుపై ఓ మహిళ రావడం రికార్డు అయ్యింది. ఆఫీసు వద్ద బైక్‌ పార్కు చేసి ఆమెను లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కార్యాలయం తాళం తెరిచి, ఆ మహిళను లోపలికి తీసుకెళ్లి తిరిగి తలుపులు వేయడం, అరగంట తర్వాత బయటకు రావడాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం, వారిద్దరూ బైక్‌పై వెళ్లిన ఆధారాలను సీసీ ఫుటేజీ ద్వారా సేకరించారు. దీంతో, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. గతంలోనూ సదరు అధికారిపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. హరిత బెర్మ్‌పార్క్‌లోని స్టాఫ్‌ రూమ్‌లో కూడా ఇలాంటి వ్యవహారమే నడిపినట్టు తెలిసింది. పార్క్‌లో వాకింగ్‌ కోసం వచ్చిన మహిళను తరచూ స్టాఫ్‌రూమ్‌లోకి తీసుకెళ్లేవాడు. సిబ్బందిని బయటకు పంపేసి రాసలీలలు సాగించేవాడని సిబ్బంది చెప్పుకొచ్చారు. అనంతరం, సీక్రెట్‌ కెమెరా పెట్టి మరీ ఈ విషయాన్ని సిబ్బందే వెలుగులోకి తెచ్చారు. ఇక, ఈయన విషయంలో ఇంత జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Gujarati Man Breaks into Seema Haider House Then Happend This Next9
సీమా హైదర్‌ ఇంట్లోకి చొరబడి మరీ..

న్యూఢిల్లీ: పహల్గాం దాడి తర్వాత పాక్‌-భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరు దేశాల పౌరులను సొంత దేశాలకు వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.సరిగ్గా రెండేళ్ల కిందట.. భారతదేశంలోని ప్రియుడి కోసం భర్తను వదిలేసి నలుగురు పిల్లలతో మరీ భారత్‌కు వచ్చేసింది సీమా హైదర్‌(37). అంతేకాదు.. ప్రియుడు సచిన్‌ మీనాను పెళ్లాడి ఓ బిడ్డను సైతం కన్నది. అయితే ప్రస్తుత పరిస్థితుల నడుమ ఆమెను పాక్‌కు పంపించాలా? వద్దా? అనేదానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. అయితే తాను మాత్రం ఇక్కడి కోడలినేనని, తనను వెనక్కి పంపించొద్దంటూ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిని ఆమె వేడుకుంటోంది. ఈలోపు..ఓ వ్యక్తి సీమా హైదర్‌ ఇంట్లోకి చొరబడ్డాడు. వెనుక నుంచి వెళ్లి ఆమెపై దాడికి ప్రయత్నించబోయాడు. అయితే అది గమనించిన ఆమె భర్త సచిన్‌.. ఆ ఆగంతకుడ్ని నిలువరించగలిగాడు. స్థానికుల సాయంతో పోలీసులకు అప్పగించాడు. సదరు నిందితుడి తేజాస్‌గా పోలీసులు నిర్ధారించారు.గుజరాత్‌ సురేందర్‌ నగర్‌కు చెందిన తేజస్‌.. న్యూఢిల్లీకి రైలు ద్వారా వచ్చాడు. అక్కడి నుంచి బస్సులోసీమా హైదర్‌ ఉంటున్న గ్రేటర్‌ నోయిడా ప్రాంతానికి చేరాడు. అతని ఫోన్‌లో సీమా హైదర్‌కు చెందిన ఫొటోల స్క్రీన్‌ షాట్స్‌ ఉన్నాయి. అతను ఏ ఉద్దేశంతో ఆ ఇంట్లోకి చొరబడ్డాడు అనేది తెలియాల్సి ఉంది అని పోలీసులు చెబుతున్నారు. అయితే సీమా హైదర్ తనపై చేతబడి చేస్తోందని.. అందుకే ఆమెను కట్టడి చేయడానికి వచ్చానని తేజస్‌ చెబుతున్నాడు. ఇది నమ్మశక్యంగా లేదని పోలీసులు చెబుతున్నారు. అతని మానసిక స్థితి బాగోలేదా? కావాలనే‌ ఇలా చేస్తున్నాడా? అనేది నిర్ధారించుకోవాల్సి ఉందని చెబుతున్నారు.

do you know Pakistan total debt10
పాకిస్థాన్‌ మొత్తం అప్పు ఎంతో తెలుసా..?

ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న దేశంగా పాకిస్థాన్‌కు ప్రపంచంలో బహు గొప్ప పేరే ఉంది. బరాక్‌ ఒబామా పాలనలో యూఎస్‌ ఆర్మీ 2011లో అల్‌-ఖైదా నాయకుడు బిన్‌లాడెన్‌ను పాకిస్థాన్‌లోని అబత్తాబాద్‌లో చంపేశారు. మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ తమకు తెలియకుండానే అక్కడ తలదాచుకున్నాడని అప్పట్లోనే పాక్‌ ప్రపంచ దేశాల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నించింది. పాక్‌ ఉగ్రవాదాన్ని పోషిస్తోందనే ముసుగును తొలగించుకునేందుకు ఎనాడూ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అక్కడి ప్రజలైనా ఆర్థికంగా, సామాజికంగా మెరుగువుతున్నారా అంటే దేశం అప్పులు భారీగా పెరుగుతున్నాయి. ఇదే అదనుగా చైనా అధిక వడ్డీలకు పాక్‌కు అప్పులిచ్చి, తనకు భవిష్యత్తులో అవసరమయ్యే మౌలిక సదుపాయాలను మాత్రం అభివృద్ధి చేస్తోంది. దీన్ని పాక్‌ గ్రహించినా చేసేదేమిలేక మిన్నకుండిపోతుంది. పాక్‌ అప్పుల చిట్టా రూ.లక్షల కోట్లకు పెరిగింది.పాకిస్థాన్‌ మొత్తం రుణం పాక్‌ రూపాయి(పీకేఆర్‌)ల్లో 70.36 ట్రిలియన్లకు (భారత కరెన్సీలో సుమారు రూ.21.15 లక్షల కోట్లు) చేరింది. ఇందులో దేశీయ, ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన అప్పులు రెండూ ఉన్నాయి. వీటిలో గణనీయమైన భాగం చైనాకు చెందినవే. పాక్‌ మొత్తం అప్పుల్లో సుమారు 22 శాతం చైనా సమకూర్చినవే కావడం గమనార్హం.పాక్‌ విదేశీ రుణం: 130 బిలియన్ డాలర్లు(సుమారు రూ.10.7 లక్షల కోట్లు).స్వల్పకాలిక విదేశీ చెల్లింపులు: వచ్చే ఏడాదిలో 30.6 బిలియన్ డాలర్లు(సుమారు రూ.2.53 లక్షల కోట్లు).రుణ-జీడీపీ నిష్పత్తి: ప్రభుత్వ ఆదాయంలో 50-60% వడ్డీ చెల్లింపులకు ఖర్చు చేయడంతో 70% పైగా ఉంది.ఐఎంఎఫ్ బెయిలవుట్: ఐఎంఎఫ్ బెయిలవుట్ అనేది అధిక రుణం, కరెన్సీ అస్థిరత లేదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సమస్యలు వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న దేశాలకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అందించే ఆర్థిక సహాయ ప్యాకేజీ. ఈ బెయిలవుట్లు సాధారణంగా రుణాల రూపంలో వస్తాయి. అందుకు తరుచూ దేశం తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి కఠినమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేయవలసి ఉంటుంది. అందులో భాగంగా గ్యాస్ టారిఫ్ పెంపు, కొత్త పన్నులు వంటి కఠిన షరతులతో 2023లో పాకిస్థాన్ 7 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్‌ బెయిలవుట్‌ ప్యాకేజీని పొందింది.విదేశీ నిల్వలు: 2025 ఏప్రిల్ నాటికి 15.4 బిలియన్ డాలర్లు(రూ.1.27 లక్షల కోట్లు). ఇది మూడు నెలల దిగుమతులకు సరిపోదు.సైనిక వ్యయంపై ప్రభావం: పెరుగుతున్న అప్పుల కారణంగా పాకిస్థాన్‌ సైన్యానికి అందించే రేషన్‌ను తగ్గించింది. ఇంధన కొరత కారణంగా సైనిక విన్యాసాలను రద్దు చేయవలసి వచ్చింది.ఇదీ చదవండి: డబుల్‌ ప్రాఫిట్‌!ఆర్థిక సవాళ్లుపాకిస్థాన్ నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా దిగుమతులను భారత్ నిలిపివేయడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలైంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ.281గా ఉంది. ఇది రాబోయే రోజుల్లో రూ.400కు పడిపోతుందనే భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవలి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ సాయాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. పరిమిత విదేశీ నిల్వలు, పెరుగుతున్న తిరిగి చెల్లించే అప్పులతో పాకిస్థాన్ రుణ సంక్షోభం తీవ్రమవుతోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement