Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Smart TV corruption in Anganwadis1
కేంద్ర నిధులను మింగేద్దాం ‘టీవీ’గా..

అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తువుల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా మింగేసేందుకు కూటమి కీలక నేతలు పెద్ద స్కెచ్‌ వేశారు. ‘సాక్షం అంగన్‌వాడీ పోషన్‌-2‘ అభియాన్‌ ద్వారా.. ఆరేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహార పంపిణీ, వస్తువుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అంగన్‌వాడీల బలోపేతానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.100 కోట్లు ఇచ్చింది. ఈ మొత్తంలో రూ.25 కోట్లతో అంగన్‌వాడీల్లో స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడే అసలు తంతు మొదలైంది. కేంద్ర నిధుల్లో స్మార్ట్‌గా కమీషన్లు కొట్టేసేందుకు కూటమి నేతలు పథక రచన చేశారు. - సాక్షి, అమరావతి » రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 9,664 సెంటర్లలో కేంద్ర నిధులతో తొలి దశలో స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కొక్క టీవీకి రూ.25 వేల చొప్పున కేటాయించారు. ఇందుకోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గవర్నమెంట్‌ ఈ మార్కెట్‌ ప్లేస్‌ (జీఈఎం) పోర్టల్‌ ద్వారా గత ఏడాది అక్టోబరులో టెండర్‌ పిలిచారు. » పేరున్న కంపెనీలకు చెందిన 11 సంస్థలు బిడ్స్‌ దాఖలు చేశాయి. వాటిలో 6 సంస్థలను టెక్నికల్‌గా టెండర్‌ కమిటీ అనర్హమైనవి (డిస్‌ క్వాలిఫై) చేసింది. ఇక మిగిలినవారిలో ఎవరికైనా టెండర్‌ ఖరారు చేశారా? అంటే అదీ లేదు. కారణం చెప్పకుండానే అర్థంతరంగా టెండర్‌ను రద్దు చేశారు. కమీషన్లకు సంబంధించిన డీల్‌ కుదరకపోవడమే దీనికి కారణమని విశ్వసనీయంగా తెలిసింది. ముందస్తు ఒప్పందాలతో మళ్లీ టెండర్‌ ప్రక్రియ రెండోసారి అనుకూలమైన కాంట్రాక్ట్‌ సంస్థలతో కొందరు కీలక నేతలు, అధికారులు కలిసి ముందస్తు ఒప్పందాలతోనే మళ్లీ టెండర్‌ ప్రక్రియ చేపట్టినట్టు విమర్శలు వస్తున్నాయి. కేంద్రం నిధులు సకాలంలో ఖర్చు చేయకుంటే మురిగిపోతాయనే సాకుతో మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.25 కోట్లను ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌)కి ఈ ఏడాది ఫిబ్రవరిలో బదిలీ చేశారు. దీన్ని అడ్డుపెట్టుకుని ఏపీటీఎస్‌ ద్వారా మార్చిలో మళ్లీ టెండర్‌ ప్రక్రియ చేపట్టారు. ఇదిగో అసలు కథ ముందస్తు ఒప్పందాలతో తమకు నచ్చిన సంస్థలకు టెండర్‌ కట్టబెట్టేలా నిబంధనలను మార్చేశారు. మొదటి టెండర్‌ నిబంధనల్లో ప్రస్తావించిన బిడ్స్‌ దాఖలు చేసే కంపెనీలు డీఎల్‌ఈడీ, ఈఎల్‌ఈడీ అనేది ఉండాలని, మూడేళ్లలో 9,800 టీవీలు సరఫరా చేసిన అనుభవం ఉండాలని, తాము చెప్పిన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌) మాత్రమే ఉండాలనే తదితర కీలక షరతులను రెండో టెండర్‌ ప్రక్రియలో లేకుండా చేశారు. దీంతో మొదటి టెండర్‌ ప్రక్రియలో 11 సంస్థలు బిడ్స్‌ వేస్తే.. రెండో టెండర్‌లో మూడు సంస్థలు మాత్రమే బిడ్స్‌ వేశాయి. ఇదంతా ముందుగా ఎంచుకున్న సంస్థకు లబ్ధి చేకూర్చడానికేనని స్పష్టమవుతోంది.

Major Tragedy At Shirgao Jatra in Goa2
Goa: దేవాలయంలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి

ఢిల్లీ: గోవాలో విషాదం చోటు చేసుకుంది. శిర్గావ్‌ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ విషాదంలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. 30 మందికి పైగా త్రీవ గాయాలయ్యాయి. గాయపడ్డ బాధితుల్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. Goa Congress is deeply saddened by the stampede at Jatrotsav of Shree Lairai Devi,Shirgao. We condemn this tragic incident and offer heartfelt condolences to the families who lost their loved ones. Wishing a speedy recovery to all those injured. 🙏@DrAnjaliTai @ViriatoFern pic.twitter.com/7kL6uNkBEi— Goa Congress (@INCGoa) May 3, 2025ఉత్తర గోవాలోని బిచ్లిమ్ జిల్లా తాలూకా శిర్గావ్ గ్రామంలో ప్రతీ ఏడాది మే 2న ఘనంగా నిర్వహించే పార్వతి దేవి(Shri Lairai Zatra) జాతర ఈ ఏడాది విషాదాన్ని నింపింది. ఈ శుక్రవారం (మే2) జాతర జరిగే సమయంలో తొక్కిసలాట ఆరుగు భక్తుల ప్రాణాల్ని తీసింది. పోలీసుల సమాచారం మేరకు శుక్రవారం జాతరను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో పాల్గొని, అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు సమారు 50వేల నుంచి 70 వేల మంది భక్తులు హాజరయ్యారు. జాతర ప్రారంభమైంది. సరిగ్గా జాతర జరిగే మార్గంలో ఎతైన ప్రదేశంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు. అదుపు తప్పి భక్తులు ఒకరిపై ఒకరు మీద పడ్డారు. దీంతో ఊపిరాడక ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు గోవా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.(బాధితుల్ని పరామర్శిస్తున్న గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌)ప్రమాదంపై సమాచారం అందుకున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. ఘటన జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Congress MP Charanjit Singh Channi Demands Surgical Strike Proof3
పాక్‌పై భారత్‌ దాడికి సాక్ష్యం ఏది?.. కాంగ్రెస్‌ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి తరుణంలో 2016లో పాకిస్తాన్‌పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్‌ విషయమై కాంగ్రెస్‌ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి రుజువు చూపించాలని అడగటం తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేతకు మరోసారి బీజేపీ కౌంటరిచ్చింది.వివరాల ప్రకారం.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం తర్వాత పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ఎంపీ చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ మీడియాతో మాట్లాడుతూ..‘పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మేము కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. దాడి వెనుక ఉన్న వారిని శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్‌ హస్తం ఉంటే వారికి తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నాం. కానీ, 2016లో పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్‌, 2019 బాలాకోట్ వైమానిక దాడులకు సంబంధించి మాత్రం మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ దాడుల విషయంలో గందరగోళం కనిపిస్తోంది. మన దేశంపై బాంబు వేస్తే మనకు తెలియదా?. పాకిస్తాన్‌లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామని వారు అంటున్నారు. కానీ, అక్కడ ఇలాంటిదేమీ జరగలేదు. ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. దీనిపై నేను మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాను. మన దేశ ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి’ అని కామెంట్స్‌ చేశారు.SICK!Rahul Gandhi's Congress continues to defend Pakistani terror!Now Charanjeet Singh Channi questions our forces.Why is Congress demoralising our forces at this critical time.Congress is taking orders directly from Pakistan!#PehalgamTerroristAttack pic.twitter.com/b2MIexdAQA— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) May 2, 2025ఇక, కాంగ్రెస్‌ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ కౌంటరిచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ నేతలు మన దేశ సాయుధ దళాల పనితీరును ప్రశ్నిస్తున్నారని ఆరోపించింది. ఆయన వ్యాఖ్యలపై ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ..‘కాంగ్రెస్ మళ్లీ మన దేశ సైన్యాన్ని మరియు వైమానిక దళాన్ని ప్రశ్నించింది. సర్జికల్ స్ట్రైక్ జరిగిందని తాను నమ్మడం లేదని.. తనకు రుజువు కావాలని చన్నీ అన్నారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబం ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉందో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. వారు భారత సైన్యం, వైమానిక దళం అబద్ధాలు చెబుతున్నారని, పాకిస్తాన్ నిజం చెబుతోందని పదే పదే ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ స్వయంగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందని చెప్పినప్పటికీ వీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు. సర్జికల్ స్ట్రైక్‌పై మీకు నిజంగా రుజువు కావాలంటే.. రాహుల్‌ గాంధీతో కలిసి చన్నీ.. పాకిస్తాన్‌ సందర్శించి దాడి ఎక్కడ జరిగిందో తనిఖీ చేయండి అంటూ కౌంటరిచ్చారు.మరోవైపు.. సదరు కాంగ్రెస్‌ ఎంపీ చన్నీకి బీజేపీ నుంచి కౌంటర్‌ రావడంతో ఆయన మాట మార్చారు. తాను సర్జికల్‌ దాడుల గురించి ఆధారాలు అడగలేదని మాట మార్చారు. అనంతరం, పాకిస్తాన్‌ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తానని ప్రకటించారు. అయితే, ఆయన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్‌ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.

Actor Simbu Play In VIRAT Kohli Biopic4
విరాట్‌ కోహ్లీ బయోపిక్‌లో తమిళ హీరో..

భారత క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీది ప్రత్యేక స్థానం. సచిన్, ధోనీల తరువాత ఆ స్థాయి భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా నిర్వహించి పేరు గడించారు. విరాట్‌ కోహ్లీకి అశేష అభిమానులు ఉన్నారు. ఇకపోతే సినిమా రంగంలో సంచలన నటుడు శింబు. ఈయనలో మంచి నటుడే కాకుండా, దర్శకుడు, కథకుడు, సంగీతదర్శకుడు, గాయకుడు ఉన్నారు. అంతేకాకుండా శింబు బహు భాషా నటుడిగా పేరు తెచ్పుకున్నారు. ఇలాంటి నటుడి చిత్రంలోని పాటను క్రీడాకారుడు విరాట్‌ కోహ్లీ లూప్‌ మోడ్‌లో(పదేపదే) వినడం విశేషం. నటుడు శింబు 2023లో కథానాయకుడిగా నటించిన చిత్రం పత్తుతల. ఏఆర్‌.రెహా్మన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో 'నీ సింగం దాన్‌' అనే పాట చోటు చేసుకుంది. ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ ఐపీఎల్‌ పోటీల్లో బెంగళూరు జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ తరఫున ఆడుతున్నారు. ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను శింబు కథానాయకుడిగా నటించిన పత్తుతల చిత్రంలోని నీ సింగం దాన్‌ అనే పల్లవితో సాగే పాటను పదేపదే విన్నానని చెప్పారు. ఆయన ఇంటర్వ్యూతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇది శింబు దృష్టికి రావడంతో ఆయన కోహ్లీ నుద్దేశించి నీయే ఒరు సింగం దాన్‌ (నువ్వే ఒక సింహం) అని పేర్కొన్నారు. దీంతో కోహ్లీ అభిమానులు, శింబు అభిమానునలు క్రీడారంగంలోనూ, సినీ రంగంలోనూ ప్రముఖులైన ఇద్దరు ఒకరినొకరు ప్రశంసించుకుంటున్నారు. మరో విషయం ఏమిటంటే శింబు, కోహ్లీలో స్వారూప్యం చాలా ఉంది. ఇద్దరూ చార్మింగ్‌గా ఉంటారు. ఇద్దరూ పొడవైన జుట్టుతో ఉంటారు. దీంతో కోహ్లీ బయోపిక్‌లో శింబు నటించనున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇంతకుముందు ధోని బయోపిక్‌తో తెరకెక్కిన ఎంఎస్‌.ధోని చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాబట్టి విరాట్‌ కోహ్లి బయోపిక్‌ తెరకెక్కే అవకాశం లేకపోలేదని, అందులో శింబు నటిస్తే అది కచ్చితంగా పాన్‌ ఇండియా చిత్రం అవుతుందనే వేరే చెప్పాల్సిన అవసరం ఉండదు. శింబు ప్రస్తుతం కమలహాసన్‌తో కలిసి నటించిన థగ్‌లైఫ్‌ చిత్రం జూన్‌ 5న తెరపైకి రానుంది. తాజాగా మరో మూడు చిత్రాలకు కమిట్‌ అయ్యారు. వీటిని పూర్తి చేసిన తరువాతనే కోహ్లీ బయోపిక్‌లో నటించే అవకాశం ఉంటుంది.

ALM Fazlur Rahman Says Bangladesh will Occupy India northeast5
‘పాక్‌పై భారత్‌ దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తాం’

ఢాకా/న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్‌పై భారత్‌ దాడి చేసిన పక్షంలో చైనా సాయంతో ఏడు ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటామని బంగ్లాదేశ్‌ తాత్కాలిక అధ్యక్షుడు యూనుస్‌ సలహాదారు ఏఎల్‌ఎం ఫజ్రుల్‌ రెహ్మన్‌ బెదిరింపులకు దిగారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతాలో మంగళవారం బెంగాలీలో రాసుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.ఈ సందర్భంగా ఏఎల్‌ఎం ఫజ్రుల్‌ రెహ్మన్‌..‘భారత ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణకు సంయుక్త సైనిక ఏర్పాట్ల కోసం చైనాతో చర్చలు జరపాల్సిన అవసరం చాలా ఉందని అందులో సూచించారు. ఇక, బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్‌ యూనస్‌కు రహ్మాన్‌ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. అయితే, ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. ఇటువంటి వాటిని తాము ప్రోత్సహించం, బలపరచం అని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను ప్రభుత్వంతో ముడిపెట్టవద్దని కూడా కోరింది. పొరుగుదేశాలతో శాంతియుత సంబంధాలను కొనసాగించాలన్నదే తమ అభిమతమని వివరించింది.ఇదిలా ఉండగా.. భారత్‌ విషయంలో పాకిస్తాన్‌ మరో స్టాండ్‌ తీసుకున్న‍ట్టు సమాచారం. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్‌ ప్రకటించడాన్ని నిరసిస్తూ ఢిల్లీకి లాంఛనంగా దౌత్య నోటీసు ఇవ్వాలని పాకిస్తాన్‌ యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌ వార్తా కథనం వెల్లడించింది. పాక్‌ విదేశీ, న్యాయ, జలవనరుల మంత్రిత్వశాఖల మధ్య జరిగిన ప్రాథమిక చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది.

200 acres zoo park Near Fouth City In Telangana6
ఫోర్త్‌ సిటీ ముచ్చర్లలో 200 ఎకరాల జూ పార్కు.. అందుబాటులోకి ఎప్పుడంటే?

విదేశీ జంతు జాతులను కనులారా చూసి ఆనందించాలని ఉందా? వేరే దేశంలోనో, దూర ప్రాంతాలకు వెళ్లో ఈ వన్యప్రాణులను చూసి రావటం అసాధ్యమని భావిస్తున్నారా? అయితే.. మీరు ఏమాత్రం చింతించనవసరంలేదు. రెండేళ్లు ఆగితే మన వద్దే ఎగ్జోటిక్‌ జూ పార్కు (విదేశీ జంతు ప్రదర్శన శాల) అందుబాటులోకి వచ్చే అవకాశముంది. నగర శివారులోని ముచ్చర్లలో ఇది ఏర్పాటు కానుంది. 200 ఎకరాల్లో విదేశీ (అన్యజాతి) జంతు ప్రదర్శన శాల సందర్శకులకు కనువిందు చేయనుంది. సింగపూర్‌ జూ తరహాలో దీనిని రూపుదిద్దనున్నారు. పీపీపీ పద్ధతిలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో ఈ జూ పార్కును ఏర్పాటు చేయనున్నారు.రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామ శివారు అటవీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం స్థలం కేటాయించింది. ప్రపంచంలోని ఇతర దేశాలకు చెందిన జంతువులను మాత్రమే ఇక్కడ ఉంచుతారు. ఇతర జూ పార్కులతో పాటు పెద్ద పెద్ద ఫామ్స్‌లలో పెంపకం చేపట్టే వారి వద్ద నుంచి వివిధ రకాల జంతువులను ఇక్కడికి తరలించి సందర్శకులకు అందుబాటులో ఉంచనున్నారు. రానున్న రెండేళ్లలో ఈ ఎగ్జోటిక్‌ యానిమల్‌ జూ పార్కు అందుబాటులోకి రానుంది. సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ నగరాలకు తోడు నాలుగో సిటీగా ఏర్పడనున్న ఫ్యూచర్‌ సిటీకి దగ్గరల్లో విదేశీ జంతు ప్రదర్శన శాల అందుబాటులోకి రానుంది. పాతబస్తీ చాంద్రాయణగుట్ట మీదుగా రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతూ ఫ్యూచర్‌ సిటీ వరకు మెట్రో రైలు కారిడార్‌ ఎక్స్‌టెన్షన్‌ ఏర్పాటు కానున్న దృష్ట్యా కొత్తగా ఏర్పడనున్న ఈ జూ పార్కుకు రోడ్డు మార్గంతో పాటు మెట్రో రైలు సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌)తో పాటు రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌) తదితర అత్యంత సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. ఈ జూ పార్కుతో పాటు మరో 1,500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని జూ సఫారీ పార్కు ఏర్పాటు చేయడానికి అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం 380 ఎకరాల్లో 2,200 జంతువులతో కొనసాగుతున్న నెహ్రూ జూ పార్కుకు అదనంగా ఈ విదేశీ జంతు ప్రదర్శన శాల అందుబాటులోకి రానుంది. ఏయే దేశాల నుంచి.. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆ్రస్టేలియా దేశాలకు చెందిన జంతు జాతులను ఎగ్జోటిక్‌ యానిమల్‌ జూ పార్కుకు తరలించనున్నారు. నెహ్రూ జూ పార్కులోని జంతువులు అక్కడే ఉండనున్నాయి. ఒకవైళ ఇప్పటికే ఇక్కడ ఉన్న విదేశీ జంతువుల సంతానం పెరిగితే వాటిని మాత్రమే అక్కడికి తరలించనున్నారు. జంతు మార్పిడిలో భాగంగా ఇతర దేశాల్లోని జూ పార్కుల నుంచి అవసరమైన జంతు జాతులను కొత్త జూ పార్కుకు తరలించనున్నారు. అలాగే.. ప్రైవేట్‌ యాజమాన్యాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫామ్స్‌ నుంచి జంతువులను ఖరీదు చేసి ఇక్కడికి తీసుకురానున్నారు. నెహ్రూ జూ పార్కులో కొనసాగుతున్న ప్రస్తుత జంతు సేకరణకు భిన్నంగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. దేశంలోనే అతిపెద్దగా.. 200 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఎగ్జోటిక్‌ యానిమల్‌ జూ పార్కు దేశంలో అతి పెద్దది కానుందని జూ పార్కు అధికారులు తెలిపారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లోని శ్రీ చామరాజేంద్ర జంతు ప్రదర్శన శాల (మైసూర్‌ జూ)లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల జంతువులకు ఆవాసంగా కొనసాగుతోంది. అంతరించిపోతున్న జంతు జాతుల పరిరక్షణ జరుగుతోంది. దీనికి తోడు ఆదాయంతో పాటు సందర్శకులకు వినోదం లభిస్తోంది. ఈ తరహాలోనే నగర శివారు ముచ్చర్లలో విదేశీ జంతు ప్రదర్శన శాల ఏర్పాటు కానుంది. అయితే ముచ్చర్ల జూ పార్కు మైసూర్‌ జూ పార్కు కన్నా.. విశాలంగా ఏర్పాటు కానుంది.పనులు చకచకా.. విదేశీ జంతు ప్రదర్శన శాల ఏర్పాటుకు పనులు చకచకా జరుగుతున్నాయి. ముచ్చర్లలో ఈ జూ పార్కు రూపుదిద్దుకోనుంది. దీంతో పాటు అక్కడే దాదాపు 1,500 ఎకరాల అటవీ స్థలాన్ని సైతం సఫారీ పార్కుకు కోసం పరిశీలిస్తున్నాం. రానున్న రెండేళ్లలో కొత్త జూ పార్కు సందర్శకులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.– డాక్టర్‌ సునీల్‌ ఎస్‌.హీరేమత్, డైరెక్టర్, తెలంగాణ జూ పార్క్స్‌.

Majority of iPhones sold in US will be made in India7
అమెరికాలో ఇక మేడిన్‌ ఇండియా ఐఫోన్లే!

న్యూఢిల్లీ: జూన్‌ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే మెజారిటీ ఐఫోన్లు భారత్‌లో తయారైనవే ఉంటాయని టెక్‌ దిగ్గజం యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ తెలిపారు. ఐప్యాడ్, మ్యాక్, యాపిల్‌ వాచ్, ఎయిర్‌పాడ్స్‌ మొదలైనవి వియత్నాంలో తయారైనవి ఉంటాయని పేర్కొన్నారు. ఇతరత్రా దేశాల్లో విక్రయించే ఉత్పత్తులు మాత్రమే అత్యధికంగా చైనాలో తయారవుతాయని పేర్కొన్నారు.చైనా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అమెరికా భారీగా టారిఫ్‌లు ప్రకటించిన నేపథ్యంలో కుక్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొంత మినహాయింపులున్నా, వివిధ టారిఫ్‌లను కలిపితే చైనా నుంచి ఎగుమతి చేసే తమ ఉత్పత్తులపై ఏకంగా 145 శాతం సుంకాలు వర్తిస్తాయని కుక్‌ తెలిపారు.ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ విశ్లేషణ ప్రకారం 2024లో అమెరికాలో ఐఫోన్‌ విక్రయాలు 7.59 కోట్లుగా ఉండగా, మార్చిలో భారత్‌ నుంచి 31 లక్షలు ఎగుమతయ్యాయి. టారిఫ్‌ రేట్లు, పాలసీలు ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే జూన్‌ త్రైమాసికంలో తమ వ్యయాలపై రూ. 900 మిలియన్‌ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందని కుక్‌ చెప్పారు.

Gujarat beat Hyderabad by 38 runs8
టైటాన్స్‌ ఏడో గెలుపు.. రైజర్స్‌ ఏడో ఓటమి

ఐపీఎల్‌లో గత సీజన్‌ రన్నరప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ‘ప్లే ఆఫ్స్‌’ వెళ్లే అవకాశాలకు దాదాపు తెరపడినట్లే! హైదరాబాద్‌ జట్టు అధికారికంగా ఇంకా నిష్క్రమించకపోయినా ఏడో ఓటమితో సమీకరణాలన్నీ సంక్లిష్టంగా మారిపోయాయి. ఆశలు నిలవాలంటే గుజరాత్‌పై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ పేలవ బౌలింగ్‌తో ఓటమిని మూటగట్టుకుంది. సొంత మైదానంలో గిల్, బట్లర్, సుదర్శన్‌ బ్యాటింగ్‌తో భారీ స్కోరు నమోదు చేసిన టైటాన్స్‌ దానిని నిలబెట్టుకుంది. ఏడో విజయంతో గుజరాత్‌ మరో మెట్టు పైకెక్కి ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఆడిన రెండు మ్యాచ్‌లలో నెగ్గిన గుజరాత్‌ టైటాన్స్‌ 2–0తో పైచేయి సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్‌ 38 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (38 బంతుల్లో 76; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్‌ బట్లర్‌ (37 బంతుల్లో 64; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... సాయి సుదర్శన్‌ (23 బంతుల్లో 48; 9 ఫోర్లు) మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేయగలిగింది. అభిషేక్‌ శర్మ (41 బంతుల్లో 74; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. పరుగుల వరద... తొలి 2 ఓవర్లలో 16 పరుగులతో గుజరాత్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదిగా మొదలైంది. అయితే తర్వాతి 4 ఓవర్లలో ఏకంగా 66 పరుగులు వచ్చాయి. షమీ ఓవర్లో సుదర్శన్‌ 5 ఫోర్లతో (4, 0, 4, 4, 4, 4) చెలరేగిపోగా, కమిన్స్‌ ఓవర్లో గిల్‌ 2 ఫోర్లు, సిక్స్‌ బాదాడు. హర్షల్‌ ఓవర్లోనూ సుదర్శన్‌ 4 ఫోర్లతో దూకుడు ప్రదర్శించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి టైటాన్స్‌ 82 పరుగులు చేసింది. ఆ జట్టుకు ఐపీఎల్‌లో ఇదే అత్యధిక పవర్‌ప్లే స్కోరు కావడం విశేషం. తొలి వికెట్‌కు గిల్‌తో 41 బంతుల్లోనే 87 పరుగులు జోడించిన అనంతరం సుదర్శన్‌ వెనుదిరిగాడు. ఆ తర్వాత 25 బంతుల్లో గిల్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. మరోవైపు బట్లర్‌ కూడా దూకుడు కనబర్చాడు. 22 పరుగుల వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను కమిన్స్‌ వదిలేయడం కూడా కలిసొచ్చింది. అన్సారీ ఓవర్లో 6, 4 కొట్టిన బట్లర్‌ 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. ఉనాద్కట్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ ఆసక్తికరంగా సాగింది. ఈ ఓవర్లో 2 సిక్స్‌లు బాదిన గుజరాత్‌...3 వికెట్లు కోల్పోయింది. అభిషేక్‌ పోరాటం వృథా... భారీ ఛేదనలో తొలి వికెట్‌కు 49 పరుగులు జత చేశాక ట్రవిస్‌ హెడ్‌ (16 బంతుల్లో 20; 4 ఫోర్లు) వెనుదిరిగాడు. అభిషేక్‌ ‌ సిక్సర్లతో ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేలో 57 పరుగులు వచ్చాయి. ఇషాన్‌ కిషన్‌ (13) పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడగా, అభిషేక్‌కు క్లాసెన్‌ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్‌) సహకరించాడు. 28 బంతుల్లోనే అభిషేక్‌ ‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. అభిషేక్‌ , క్లాసెన్‌ మూడో వికెట్‌కు 33 బంతుల్లో 57 పరుగులు జత చేసినా... చేయాల్సిన రన్‌రేట్‌ పైపైకి వెళ్లడంతో బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. 31 బంతుల్లో 86 పరుగులు చేయాల్సిన స్థితిలో అభిషేక్‌ ‌ అవుట్‌ కాగా... మరో మూడు బంతులకే క్లాసెన్‌ కూడా వెనుదిరగడంతో హైదరాబాద్‌ ఆశలు గల్లంతయ్యాయి. చివర్లో నితీశ్‌ కుమార్‌ రెడ్డి (10 బంతుల్లో 21 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ప్యాట్‌ కమిన్స్‌ (10 బంతుల్లో 19 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) కొన్ని షాట్లు ఆడినా అది సరిపోలేదు. స్కోరు వివరాలు గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సుదర్శన్‌ (సి) క్లాసెన్‌ (బి) అన్సారీ 48; గిల్‌ (రనౌట్‌) 76; బట్లర్‌ (సి) అభిషేక్‌ ‌ (బి) కమిన్స్‌ 64; సుందర్‌ (సి) నితీశ్‌ రెడ్డి (బి) ఉనాద్కట్‌ 21; షారుఖ్‌ (నాటౌట్‌) 6; తెవాటియా (సి) అనికేత్‌ (బి) ఉనాద్కట్‌ 6; రషీద్‌ (సి) అండ్‌ (బి) ఉనాద్కట్‌ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–87, 2–149, 3–206, 4–218, 5–224, 6–224. బౌలింగ్‌: షమీ 3–0–48–0, ఉనాద్కట్‌ 4–0–35–3, కమిన్స్‌ 4–0–40–1, హర్షల్‌ 3–0–41–0, అన్సారీ 4–0–42–1, కమిందు 2–0–18–0. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) రషీద్‌ (బి) ప్రసిధ్‌ 20; అభిషేక్‌ ‌ (సి) సిరాజ్‌ (బి) ఇషాంత్‌ 74; ఇషాన్‌ కిషన్‌ (సి) ప్రసిధ్‌ (బి) కొయెట్జీ 13; క్లాసెన్‌ (సి) బట్లర్‌ (బి) ప్రసిధ్‌ 23; అనికేత్‌ (సి) షారుఖ్‌ (బి) సిరాజ్‌ 3; నితీశ్‌ రెడ్డి (నాటౌట్‌) 21; కమిందు (సి) బట్లర్‌ (బి) సిరాజ్‌ 0; కమిన్స్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–49, 2–82, 3–139, 4–141, 5–145, 6–145, బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–33–2, ఇషాంత్‌ 3.2–0–35–1, ప్రసిధ్‌ 4–0–19–2, కొయెట్జీ 4–0–36–1, సుందర్‌ 1–0–6–0, రషీద్‌ 3–0–50–0, సాయికిషోర్‌ 0.4–0–1–0. ఐపీఎల్‌లో నేడుబెంగళూరు X చెన్నై వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Supreme Court clarifies that it will clarify the jurisdiction of AP CID9
ఏపీ సీఐడీ పరిధి సంగతి తేలుస్తాం

సాక్షి, అమరావతి: ఏపీ సీఐడీ పరిధి సంగతిని తేలుస్తామని, సీఐడీ కూడా చట్ట నిబంధనల ప్రకా­రమే నడుచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో పూర్తి­స్థాయిలో విచారణ జరుపుతా­మని పేర్కొంది. మద్యం కొనుగోళ్ల వ్యవ­హా­రంలో విచారణకు హాజరు కావాలంటూ బీఎన్‌­ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 179 కింద ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధి­కారులు తనకు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ రాజ్‌ కేసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సీఐడీ నోటీసుల్లో జోక్యానికి నిరాకరిస్తూ హైకోర్టు గత నెల 4న ఇచ్చిన ఉత్తర్వులపై స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయ­మూర్తులు జస్టిస్‌ జేబీ పార్థీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ ధర్మాసనం శుక్రవారం విచా­రణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, సీఐడీ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్, ప్ర­త్యే­క దర్యాప్తు బృందం (సిట్‌) అధికారి, ఎక్సై­­జ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కు­మార్‌ మీనాలకు నోటీసులు జారీ చేసింది. తదు­పరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది.తెలంగాణ పరిధిలో జోక్యం చేసుకునే అధికారం ఏపీ సీఐడీకి లేదుఅంతకుముందు రాజ్‌ కేసిరెడ్డి తరఫు న్యాయవాది శ్రీహర్ష పీచర వాదనలు వినిపించారు. రాజ్‌ హైదరాబాద్‌లో నివాసం ఉంటారని, అందువల్ల ఆయనకు నోటీసులు జారీ చేసే పరిధి ఏపీ సీఐడీకి లేదని వివరించారు. ఒక రాష్ట్రం తన పరిధిలోని ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే కలగజేసుకునే వీలుంటుందని తెలి­పారు. తాము సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ మొదట ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేశామని, అయితే ఏపీ సీఐడీ పరిధిలోకి తెలంగాణ రాష్ట్రం వస్తుందంటూ 2022లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తమ పిటిషన్‌లో జోక్యం చేసుకోవ­డానికి హైకోర్టు నిరాకరించిందని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ సీఐడీలకు ఇరు రాష్ట్రాలు కూడా ఒకదానికొకటి పొరుగు పోలీస్‌ స్టేషన్లు అవుతాయన్న తీర్పు ఇవ్వడం ద్వారా హైకోర్టు పొరపాటు చేసిందని వివరించారు. సీఐడీ పరిధి విషయంలో హైకోర్టు చెప్పిన భాష్యం వల్ల సెక్షన్‌ 179 నిరర్థకం అవుతోందన్నారు. హైకోర్టు తీర్పుతో ఏపీ సీఐడీకి అపరిమిత అధికారులు దఖలు పడ్డాయన్నారు. దీంతో పొరుగు రాష్ట్రంలోని వారికి సైతం నోటీసులు ఇచ్చే అధికారం సీఐడీకి కలిగిందని తెలిపారు. అందులో భాగంగానే పిటిషనర్‌ రాజ్‌ కేసిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. కేవలం రాజకీయ కారణాలతోనే పిటిషనర్‌ను తప్పుడు కేసులో ఇరికించినట్లు చెప్పారు.ఇప్పటికే అరెస్ట్‌ చేశారు.. ఈ వ్యాజ్యం నిరర్థకంరాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, సీఐడీ పరిధి విషయంలో ఏపీ హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని.. పిటిషనర్‌ను సీఐడీ ఇప్పటికే అరెస్ట్‌ చేసిందని తెలిపారు. కాబట్టి నోటీసులను సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యం నిరర్థకం అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ పరిధిని తేలుస్తాం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సీఐడీ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు అధికారి, ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంతో కలిపి ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని తెలిపింది.

Rasi Phalalu: Daily Horoscope On 03-05-2025 In Telugu10
ఈ రాశి వారు కొత్త కార్యక్రమాలు చేపడతారు.. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు.

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.షష్ఠి ప.1.20 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: పునర్వసు సా.5.47 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ఉ.6.03 నుండి 7.37 వరకు, తదుపరి రా.1.46 నుండి 3.22 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.03 నుండి 7.14 వరకు, అమృతఘడియలు: ప.3.27 నుండి 5.02 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.37, సూర్యాస్తమయం: 6.15.మేషం: కొన్ని పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. స్వల్ప ధనలాభం. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రగతి కనిపిస్తుంది.మిథునం: మిత్రులతో విభేదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.కర్కాటకం: శుభవార్తా శ్రవణం. కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా విజయమే. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. దైవచింతన.సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమ తప్పదు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.కన్య: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలను సమయానికి పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.తుల: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.వృశ్చికం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో వివాదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.ధనుస్సు: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.మకరం: సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దైవదర్శనాలు. శుభవర్తమానాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు.కుంభం: సన్నిహితులతో విభేదిస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు.మీనం: కార్యజయం. ధనలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. నూతన ఉద్యోగలాభం. సోదరుల నుంచి పిలుపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement