Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

KSR Comments On Yellow Media And Chandrababu1
అంతా ఎల్లో మాయ.. రుషికొండా గోంగూరా అంటున్న కూటమి!

రుషికొండ నిర్మాణాల విషయంలో ఎల్లోమీడియా చేసిన రాద్ధాంతం గుర్తుందా?. టూరిజం శాఖ ఆధ్వర్యంలోని పాత భవనాలను తొలగించి అత్యాధునిక సదుపాయాలతో కొత్త భవనాలను నిర్మించే యోచన చేసినందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి నానా విమర్శలూ చేశాయి. పర్యావరణం నాశనమైపోతోందని గగ్గోలు పెట్టారు. రిషికొండకు గుండు కొడుతున్నారని దుర్మార్గపు ప్రచారం చేశారు.సీన్ కట్ చేస్తే.. ఆ అభిప్రాయాలు ఇప్పుడు మారిపోయాయి. రుషికొండ వృథాగా పడి ఉన్న భూమి అయిపోయింది. రుషులు నడయాడిన భూమి కాస్తా ప్రైవేటు సంస్థలకు సంపద సృష్టించే కొండలయ్యాయి. ఆ ప్రాంతాన్ని బోడిగుండు చేసినా, పర్యావరణం విధ్వంసమైనా ఫర్వాలేదు. అది అభివృద్ది కింద లెక్క. జగన్ ప్రభుత్వం తరఫున భవనాలు నిర్మిస్తే అదంతా ఆయన వ్యక్తిగత అవసరాల కోసం కడుతున్నట్లు. ప్రస్తుతం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఉత్తపుణ్యానికి ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతుంటే అది గొప్ప పని.అదేమిటి! మీరే కదా.. రిషికొండపై ఎలాంటి నిర్మాణాలు జరగరాదని చెప్పారే! అని ఎవరైనా ప్రశ్నిస్తే, లోపల నవ్వుకుని పిచ్చోళ్లారా? మేము ఏది రాస్తే దానిని నమ్మాలి?. మళ్లీ మేము మాట మార్చి అబద్దాలు రాస్తే అవే నిజమని నమ్మాలి.. అన్న చందంగా ఎల్లో మీడియా కథనాలు ఉంటున్నాయి. ఎల్లో మీడియా ఇప్పుడు ఏం రాస్తోందో చూశారా!. రిషికొండ భూముల గురించి ప్రశ్నించినా, అమరావతి రాజధానిలో లక్ష ఎకరాల పచ్చటి పంట భూములను ఎందుకు నాశనం చేస్తున్నారని అడిగినా.. అది రాష్ట్ర ప్రగతిపై పగ పట్టినట్లట.. గతంలో ఏ మీడియా అయితే తెలుగుదేశం, జనసేన వంటి పార్టీల కోసం దారుణమైన అసత్యాలు ప్రచారం చేశాయో, ఇప్పుడు అదే మీడియా మొత్తం రివర్స్‌లో రాస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదట. వారు ఎకరా 99 పైసలకు ప్రైవేటు వారికి, ఉర్సా కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నా అడిగితే విషనాగు బుసలు కొడుతున్నట్లట. ఇలా నీచంగా తయారైంది వీరి జర్నలిజం.ఒకప్పుడు పవిత్రమైన వృత్తిగా ఉన్న ఈ పాత్రికేయాన్ని వ్యభిచార వ్యాపారంగా మార్చేశారన్న బాధ కలుగుతుంది. అయినా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవరు ఏమీ చేయలేరు. రిషికొండపై ఐదెకరాల భూమిలో భవనాలు కడితేనే విధ్వంసం అయితే, మరి రాజధాని పేరుతో లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసం జరుగుతుంటే ఎవరూ ప్రశ్నించకూడదట. అది పెట్టుబడులను అడ్డుకోవడమట. ఊరూపేరులేని ఉర్సా కంపెనీకి సంబంధించి ప్రభుత్వమే ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయినా, తెలుగుదేశం పక్షాన ఎల్లో మీడియా మాత్రం భుజాన వేసుకుని అది గొప్ప కంపెనీ అని చెబుతోంది. రెండు నెలల క్రితం ఏర్పడిన సంస్థకు ఏకంగా మూడు వేల కోట్ల విలువైన అరవై ఎకరాల భూమిని ఎవరైనా ఇస్తారా?. అదానీకి గత జగన్ ప్రభుత్వం డేటా సెంటర్ నిమిత్తం ఎకరా కోటి రూపాయల చొప్పున భూమి ఇస్తే ఏపీని అదానీకి జగన్ రాసిచ్చేస్తున్నారంటూ ప్రచారం చేసిన వారికి, బోగస్ అని ఆరోపణలు ఎదుర్కుంటున్న కంపెనీ మాత్రం అంతర్జాతీయ సంస్థ. వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెబుతాడని సామెత.ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా రీతి అలాగే ఉంది. జగన్ ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే వార్తలు ఇస్తే తప్పు కాదు. కానీ, ఉన్నవి, లేనివి రాసి పాఠకులను మోసం చేసి, ప్రజలను ప్రభావితం చేయడానికి పత్రికలను పార్టీ కరపత్రాలుగా, టీవీలను బాకాలుగా మార్చేసుకుని నిస్సిగ్గుగా పనిచేస్తుండటమే విషాదకరం. అదే చంద్రబాబు ప్రభుత్వం రాగానే అంతా బ్రహ్మండం, భజగోవిందం అని ఒకటే భజన చేస్తున్నారు. ఇక, అమరావతి విషయానికి వద్దాం. అమరావతి రాజధానికి ఏభై వేల ఎకరాలు సరిపోతుందనే కదా గత ప్రభుత్వ హయాంలో చెప్పింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా 45 వేల ఎకరాలు ఎందుకు అని అడిగితే అంతర్జాతీయ నగరం కావాలా? మున్సిపాల్టీగానే ఉంచాలా అన్నది తేల్చుకోవాలన్నట్లుగా ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోతే అది ప్రపంచ నగరం కాదట. అంతర్జాతీయ స్టేడియం లేకపోతే గుర్తింపు ఉండదట. 2014 టర్మ్‌లో నవ నగరాలు అంటూ ఓ పెద్ద కాన్సెప్ట్ చెప్పారు కదా? అందులో క్రీడా నగరం కూడా ఉంది కదా? అప్పుడు కూడా స్టేడియం ప్లాన్ చేశారు కదా? మళ్లీ ఇప్పుడు ఈ పాట ఏమిటి అని అడగకూడదు. అడిగితే అమరావతికి అడ్డుపడినట్లు అన్నమాట.లక్ష ఎకరాలు, లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు. లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు కేవలం రాజధాని పేరుతో ఉన్న ఆ ముప్పై, నలభై గ్రామాలలోనే చేపడితే, మిగిలిన ప్రాంతం పరిస్థితి ఏమిటని ఎవరూ ప్రశ్నించకూడదు. అందుకే వ్యూహాత్మకంగా రాయలసీమకు ఏదో ఇస్తున్నామని, ఉత్తరాంధ్రకు ఇంకేదో ఇస్తున్నామని ఆ ప్రాంత ప్రజలను భ్రమలలో పెట్టడానికి కొన్ని కార్యక్రమాలు చేయడం, ప్రచారం సాగించడం జరుగుతోంది.ఉదాహరణకు ఎప్పటి నుంచో కడప సమీపంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడను కొత్తగా ఇవ్వబోతున్నట్లు ఎల్లో మీడియా రాసింది. ఇదంతా డైవర్షన్ రాజకీయం అన్నమాట. మరో వైపు అమరావతి అంటే ఎంత విస్తీర్ణం, పరిధులు ఏమిటి అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నోటిఫై చేయలేదట. ఇప్పుడు దానిపై ఆలోచన చేస్తారట. ఇంకో సంగతి చెప్పాలి. గత టర్మ్‌లో మోదీ శంకుస్థాపన చేయడానికి ముందు, ఆ తర్వాత, ఆయా నిర్మాణాలకు స్వయంగా చంద్రబాబు తన కుటుంబ సమేతంగా పూజలు, పునస్కారాలు చేసి మళ్లీ శంకుస్థాపనలు చేశారు. కేంద్రం నుంచి కొందరు ప్రముఖులను కూడా అందులో భాగస్వాములను చేశారు. గతంలో మాదిరే ఇప్పుడు కూడా ఆర్భాటాలకు వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకో మాట చెప్పాలి.తెలంగాణలో హైదరాబాద్‌లో 400 ఎకరాల భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో నిర్మాణాలు చేయతలపెడితే పర్యావరణం విధ్వంసం అయిందని మోదీనే నానా యాగీ చేశారు. అలాంటిది ఏపీలో లక్ష ఎకరాలలో పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే, పచ్చటి పంట భూములను బీడులుగా మార్చుతుంటే, అదంతా అభివృద్ది అని మోదీ కూడా భావిస్తున్నారేమో తెలియదు. చంద్రబాబు, మోదీ.. 2019 టైమ్ లో తీవ్రంగా ఒకరినొకరు విమర్శించుకున్నారు. దేశ ప్రధానిని ఉగ్రవాది అని చంద్రబాబు అంటే, ఈయనను పెద్ద అవినీతిపరుడని, పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని మోదీ ధ్వజమెత్తారు. 2024 నాటికి మళ్లీ సీన్ మారింది. వీరిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. ఇదేమిటి.. ఇంత సీనియర్ నేతలు ఇలా చేయవచ్చా అని ఎవరైనా అమాయకులు అడిగితే అది వారి ఖర్మ అనుకోవాలి.గతసారి మోదీ అమరావతి వచ్చి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారని అప్పట్లో చంద్రబాబు నిందించేవారు. ప్రస్తుతం కేంద్రం బ్రహ్మాండంగా సాయం చేస్తోందని చెబుతున్నారు. అది నిజమో కాదో అందరికీ తెలుసు. రిషికొండ అయినా, అమరావతి అయినా తమ రాజకీయ అవసరాలకు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఎన్ని డ్రామాలు అయినా ఆడగలుగుతున్నారు. అదే వారి గొప్పదనం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

CIA plans to layoffs workforce by some 1,200 positions2
CIA: ట్రంప్‌ ఎఫెక్ట్‌.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వేలాడుతున్న లేఆప్స్‌ కత్తి..

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ మరోసారి భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టారు.అమెరికా గూఢాచార సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ)లో 1200 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ తెలిపింది.JUST IN: The CIA plans to cut 1,200 employees as the Trump admin eyes downsizing of thousands across the U.S. intelligence community. Keep cutting and downsizing the government!— Gunther Eagleman™ (@GuntherEagleman) May 2, 2025సీఐఏలో ఉద్యోగుల తొలగింపుపై ట్రంప్ పరిపాలన విభాగం చట్టసభ సభ్యులకు సమాచారం అందించింది. అయితే, సీఐఏ సంత్సరాలుగా తొలగింపులకు బదులుగా నియామకాల్ని నిలిపి వేసిన విషయాన్ని వాషింగ్టన్‌ పోస్ట్‌ తన కథనంలో పేర్కొంది. సీఐఏ ఉద్యోగుల తొలగింపులపై ట్రంప్‌ పరిపాలన విభాగం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదే అంశంపై సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ మాట్లాడుతూ జాతీయ భద్రతా ప్రాధాన్యతలకు అనుగుణంగా తమ నిర్ణయాలు ఉంటాయి. ఈ చర్యలు సీఐఏ పటిష్టతకు దోహదం చేకూర్చడమే కాదు..ఏజెన్సీలో కొత్త శక్తిని నింపడానికి.. మరింత మెరుగ్గా మార్చడానికి చేపట్టిన వ్యూహంలో భాగం’ అని చెప్పారు.దేశంలో అనవసర ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ డోజ్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ విభాగం ఉద్యోగుల్నితొలగిస్తుంది. ఇప్పటికే పలు రంగాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించింది. కొద్ది రోజుల క్రితం ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీసెస్‌కు (ఐఆర్‌ఎస్‌) చెందిన 20000 మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా, సీఐఏ ఉద్యోగుల్ని సైతం తొలగించే దిశగా చర్యలకు ఉపక్రమించింది.

MI Are Close But This Team Title Favourites: Gavaskar On IPL 2025 Winner3
టైటిల్‌ గెలిచేది ఆ జట్టే.. తొలిసారి ట్రోఫీని ముద్దాడుతారు: భారత దిగ్గజం

ఐపీఎల్‌-2025 (IPL 2025) ప్లే ఆఫ్స్‌ దశకు చేరుకుంది. ముంబై ఇండియన్స్‌. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా.. మిగతా తొమ్మిది జట్లు పదేసి మ్యాచ్‌లు ఆడేశాయి. ఈ క్రమంలో ముంబై, రాజస్తాన్‌కి ఇంకో మూడు.. మిగతా జట్లకు మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.అగ్రస్థానంలోఇక ఇప్పటికి పదకొండింట ఏడు గెలిచిన ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్‌ టైటాన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు కూడా ఏడేసి మ్యాచ్‌లు గెలిచినా.. రన్‌రేటు పరంగా వెనుకబడి వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.ఇక పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ చెరో ఆరు మ్యాచ్‌లు గెలిచి ఇదే తరహాలో నాలుగు, ఐదు ర్యాంకుల్లో ఉన్నాయి. మరోవైపు.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఐదు గెలిచి ఆరో స్థానంలో కొనసాగుతుండగా.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నాలుగు విజయాలతో ఏడు, రాజస్తాన్‌ రాయల్స్‌ మూడు గెలిచి ఎనిమిదో స్థానంలో ఉంది.అట్టడుగునఅదే విధంగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మూడు , చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండు మాత్రమే గెలిచి అట్టడుగున తొమ్మిది, పది స్థానాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కాగా ఐపీఎల్‌-2024లో కేకేఆర్‌ విజేతగా నిలవగా.. సన్‌రైజర్స్‌ రన్నరప్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.ఈసారి ఈ రెండు జట్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాయి. మరోవైపు.. ఇంత వరకు టైటిల్‌ గెలవని ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ మాత్రం అదరగొడుతున్నాయి.ముఖ్యంగా కొత్త కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ సారథ్యంలో ఆర్సీబీ సరికొత్త ఉత్సాహంతో వరుస విజయాలతో ఆకట్టుకుంటోంది. విరాట్‌ కోహ్లికి ఓపెనింగ్‌ జోడీగా వచ్చిన ఫిల్‌ సాల్ట్‌ అదరగొడుతుండగా.. బ్యాటర్‌గానూ రజత్‌ రాణిస్తున్నాడు. మరోవైపు.. దేవదత్‌ పడిక్కల్‌, టిమ్‌ డేవిడ్‌ అవసరమైనప్పుడల్లా జట్టును ఆదుకుంటున్నాడు.ఇక బౌలింగ్‌ విభాగంలో పేసర్లు జోష్‌ హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ ప్రభావం చూపుతుండగా.. స్పిన్నర్‌ కృనాల్‌ పాండ్యా ఈసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. సమిష్టి ప్రదర్శనకు నిదర్శనంఇప్పటికి గెలిచిన ఏడు మ్యాచ్‌లలో ఐదుగురు వేర్వేరు ప్లేయర్లు (కోహ్లి, కృనాల్‌ పాండ్యా (3), పాటిదార్‌ (2), ఫిల్‌ సాల్ట్‌, హాజిల్‌వుడ్‌) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు గెలవడం వారి సమిష్టి ప్రదర్శనకు నిదర్శనం. మొత్తానికి ఈసారి కలిసికట్టుగా రాణిస్తూ ఆర్సీబీ టైటిల్‌ గెలవాలన్న కలను సాకారం చేసుకునే దిశగా పయనిస్తోంది.టైటిల్‌ గెలిచేది ఆ జట్టే.. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్‌, కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్‌ ఆర్సీబీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తోంది.వాళ్ల ఫీల్డింగ్‌ కూడా సూపర్‌. ముంబై ఇండియన్స్‌ కూడా అదరగొడుతోంది. అయితే, మిగతా మ్యాచ్‌లలో కూడా వారు రాణిస్తారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము.అయితే, ఇదే జోరు కనబరిస్తే వాళ్లకు తిరుగు ఉండదు. కానీ.. ఈసారి మాత్రం ఆర్సీబీనే టైటిల్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది’’ అని గావస్కర్‌ ఇండియా టుడేతో పేర్కొన్నాడు. అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తున్న ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడబోతోందని సన్నీ జోస్యం చెప్పాడు.చదవండి: Shubman Gill: అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని!

YSRCP Ambati Rambabu Questioned Chandrababu Over Amaravati4
‘5000 కోట్లు.. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?’

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. ఇప్పుడు మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు? అని ప్రశ్నించారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్‌ క్లాస్‌ క్యాపిటల్‌ నిర్మిస్తారా? అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు అర్థం చేసుకోవాలి. గతంలో ప్రధాని మోదీ మట్టి, నీరు తీసుకొచ్చి మా ముఖాన కొట్టారని చంద్రబాబు అనలేదా?. మోదీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని గతంలో పవన్‌ విమర్శించలేదా?. మోదీ, చంద్రబాబు పరస్పర అవసరాల కోసం రాజధానిని వాడుకుంటున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్‌ క్లాస్‌ క్యాపిటల్‌ నిర్మిస్తారంట. ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే సభ నిర్వహించినట్టు ఉంది.చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోంది. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారు. అమరావతిపై ఇప్పటికే రూ.52వేల కోట్లు అప్పు చేశారు. ఈ అప్పులు ఎవరు తీర్చుతారు?. ఈ 52 వేల కోట్లను పారదర్శకంగా ఖర్చు పెడుతున్నారా?. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. అన్నీ తాత్కాలిక భవనాలనే నిర్మించారు కదా?. తాత్కాలికం అంటూనే రూ.5000 కోట్లు ఖర్చు చేశారు. చదరపు అడుగుకు రూ.11వేలు ఖర్చు చేసి, డబ్బులు గంగలో కలిపారు. రాజధాని నిర్మాణానికి 53వేల ఎకరాలు సరిపోదా.. మరో 45వేల కావాలంట!. గన్నవరం పక్కనే అమరావతిలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మిస్తారట. 2014-19 మధ్యలో పూర్తి చేయని రాజధానిని వచ్చే మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు?’ అని ప్రశ్నించారు.అమరావతి పున:ప్రారంభ సభలో చంద్రబాబు, లోకేష్ అసత్యాలు చెప్పారు. అమరావతి ఒక అంతులేని కథ. అమరావతి నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారు. అందుకే చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారు. పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో అవకాశం కల్పించారు. చంద్రబాబును అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు. రాత్రికి రాత్రే ఎందుకు హైదరాబాద్‌ నుండి వచ్చేశారు?. అమరావతి పేరుతో చంద్రబాబు అందరినీ ముంచేశారు. అమరావతి విధ్వంసం చేసిన వ్యక్తి చంద్రబాబు. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ నగరం అని చెప్తున్నారు. సెల్ఫ్ సస్టైనబుల్ నగరానికి 52 వేల కోట్లు ఎందుకు అప్పు చేశారు. వర్షం పడితే అమరావతి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Simhachalam Temple Wall Collapsed incident Updates5
సింహాచలం విషాదం.. గోడ నిర్మాణం వద్దని వైదికులు, అర్చకులు వారించినా..

విశాఖ: సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్‌ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.సింహాచలం గోడ నిర్మాణంలో ఎలాంటి టెండర్‌ లేదు. నోటి మాటతో నిర్మాణం జరిగింది. దీంతో పాటు వైదిక నిబంధనలను ఉల్లంఘించినట్లు సింహాచలం చందనోత్సవంలో జరిగిన దుర్ఘటనపై త్రిసభ్య కమిటీ చేపట్టిన రెండో రోజు విచారణలో తేలింది. విచారణలో భాగంగా త్రిసభ్య కమిషన్‌ విషాదానికి సంబంధించి ఆలయ అర్చకులు, వైదికుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించింది. సింహగిరిలో కూలిన గోడపై త్రిసభ్య కమిటీ సభ్యుల విచారణలో.. దేవాలయంలో నోటి మాటతో గోడ నిర్మాణం చేపట్టారని, అనుమతులు, ప్రొసీజర్‌ ఫాలోకాలేదని స్పష్టమైంది. పైగా వైదిక నిబంధనలు సైతం ఉల్లంఘించారని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్‌కు సింహాచలం ఆలయ అర్చకులు వివరించారు. ‘మాస్టర్ ప్లాన్‌ డ్రాఫ్ట్‌కు విరుద్ధంగా నిర్మాణం చేపట్టొద్దని ముందే చెప్పాం. అయినా మా మాట వినకుండా గోడ నిర్మాణం చేపట్టారని’ సింహాచలం వైదికులు, అర్చకులు వివరించారు. అర్చకులు, వైదికులు ఇచ్చిన సమాచారాన్ని, వివరణలను ఇవాళ ఏపీ ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో త్రిసభ్య కమిషన్‌ పొందుపరచనుంది.

Pakistan seeks Gulf help Over tension with India Pahalgam6
భారత్‌తో దాయాది యుద్ధం.. బలం కోసం పాక్‌ ప్రధాని కొత్త ఎత్తులు!

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్ర దాడిలో కారణంగా ఈ పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, పాక్‌ ఆర్మీ సైనికులు ఈ ఘటనలో భాగం కావడంతో దాయాదిపై దాడులకు భారత్‌ ప్లాన్‌ చేస్తోంది. సరిహద్దుల్లో పాక్‌ కవ్వింపు చర్యలకు చెక్‌ పెడుతూ.. ఎప్పటికప్పడు భారత్‌ బలగాలు యుద్దానికి సిద్ధమవుతున్నాయి. దీంతో, భారత్ చర్యలపై భయంతో వణికిపోతున్న పాక్‌.. రక్షణ కోసం ప్రయత్నాలు చేస్తోంది. గల్ఫ్‌ దేశాలతో పాక్‌ ప్రధాని మంతనాలు జరుపుతున్నారు.వివరాల ప్రకారం.. పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్‌కు భారత్‌ భయం పట్టుకుంది. భారత్‌ ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందో తెలియక భయంతో వణికిపోతోంది. మరోవైపు.. దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. అనేక దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. భారత్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా సైతం చేతులు కలిపింది. దీంతో, పాకిస్తాన్‌కు మరింత ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో పాక్‌ సర్కార్‌.. ప్రపంచ దేశాల సాయం చేతులు చాస్తోంది. సాయం చేయాలని పాక్‌ ప్రధాని షహబాజ్ షరీఫ్ మంతనాలు జరుపుతున్నారు.నేతలతో పాక్‌ ప్రధాని చర్చలు..తాజాగా ప్రధాని షహబాజ్ షరీఫ్.. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్‌తో మాట్లాడి రెండు దేశాల మధ్య ఘర్షణను తగ్గించాలని కోరారు. ఉద్రిక్తతలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని అరేబియా, యూఏఈతో సహా ఇతర గల్ఫ్ దేశాధినేతలతో భేటీ అయ్యారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి హమర్ ఒబైద్ ఇబ్రహీం అల్ జాబీతో పాక్ ప్రధాని సమావేశమయ్యారు. కువైట్ రాయబారి నాసన్ రెహ్మన్ జాసన్‌ను కూడా పాక్ ప్రధాని కలిసి విజ్ఞప్తి చేశారు.Chinese Ambassador in Pakistan, H.E Jiang Zaidong calls on Prime Minister Muhammad Shehbaz Sharif in Islamabad.May 1, 2025. pic.twitter.com/wmJlR2b0gk— Prime Minister's Office (@PakPMO) May 2, 2025ఈ మేరకు పాక్‌ పీఎంఓ ఓ ప్రకటనలో.. పాకిస్తాన్‌లోని సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయిద్ అల్ మాలికితో షహబాబ్‌ సమావేశమైన ఫొటోను విడుదల చేసింది. ఈ సందర్బంగా దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం కోసం పాకిస్తాన్‌ కృషి చేస్తుందని ప్రధాని పునరుద్ఘాటించారని తెలిపింది. ఇదిలా ఉండగా.. భారత్‌ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్‌ ఇప్పటికే చైనా, రష్యాలను అభ్యర్థించింది. ఈ దాడిపై నిష్పక్షపాత విచారణకు సహకరిస్తామని పాక్‌ చెప్పుకొచ్చింది.Ambassador of UAE to Pakistan H.E. Hamad Obaid Ibrahim Salem Al-Zaabi called on Prime Minister Muhammad Shehbaz Sharif.May 2, 2025. pic.twitter.com/c2KGCrKvbB— Prime Minister's Office (@PakPMO) May 2, 2025పాక్‌కు మద్దతిచ్చే దేశాలు ఇవే..ఇక, పాకిస్తాన్‌పై భారత్‌ దాడులు చేస్తే.. దాయాది కొన్ని దేశాలు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. చైనా, టర్కీ, అజర్ బైజాన్, బంగ్లాదేశ్, కొన్ని ముస్లిం లీగ్ దేశాలు పాక్‌కు అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు టర్కీ సైతం మద్దతు తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ కు మద్దతుగా పలుమార్లు టర్కీ నిలిచింది. భారత్‌తో వైరం కారణంగా చైనా.. పాక్‌కు అండగా ఉండనుంది. ప్రస్తుతం భారతదేశంలో అంతగా సఖ్యతలేని బంగ్లాదేశ్ కూడా పాక్‌కు మద్దతుగా నిలిచి అవకాశం కనిపిస్తున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంలో భాగంగా అక్కడ మారిన ప్రభుత్వం భారత్ కు అనుకూలంగా లేదు. కనుక ఈ దాయాది దేశం కూడా మనకు వ్యతిరేకంగా నిలిచి అవకాశం ఉంటుంది.

India first Tesla Cybertruck bought by the badshah7
భారత్‌ రోడ్లపై టెస్లా కారు.. మొదటి ఓనర్‌ ఈయనే..

అమెరికాలో టాప్‌ ఎలక్ట్రిక్‌ వాహన తయారీదారుగా ఉన్న టెస్లా సంస్థ కార్లు భారత్‌లోకి ప్రవేశించాయి. సూరత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లవ్జీ దాలియా టెస్లా సైబర్‌ట్రక్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. వారం రోజులుగా టెస్లా సైబర్‌ట్రక్‌ సూరత్ రోడ్లపై కనిపిస్తూ సందడి చేస్తుంది. అయితే ఈ వాహనాన్ని దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు దాలియా కుమారుడు పీయూష్‌ తెలిపారు.ధర రూ.60 లక్షలు..లావ్జీ దాలియా కొనుగోలు చేసిన టెస్లా సైబర్‌ట్రక్‌ భారత్‌లోనే మొదటిదని పీయూష్‌ పేర్కొన్నారు. ‘మేము ఆన్‌లైన్‌లో తనిఖీ చేసిన దాని ప్రకారం, ఈ సైబర్‌ట్రక్‌ దేశంలోనే మొదటిది. అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న టెస్లా షోరూమ్‌లో ఆరు నెలల క్రితం ఈ కారును బుక్ చేశాం. కొద్దీ రోజుల కిందటే దీన్ని దుబాయ్‌లో డెలివరీ చేశారు. అక్కడి నుంచి భారత్‌ తీసుకొచ్చాం’ అని స్పష్టం చేశారు. ఈ సైబర్‌ట్రక్‌ వేరియంట్‌ ధర సుమారు రూ.60 లక్షలు ఉందని సోషల్‌ మీడియా ద్వారా తెలుస్తుంది.ఇదీ చదవండి: కథన రంగంలో ఏఐ చిందులుఎవరీ లవ్జీ దాలియా?‘లవ్జీ బాద్‌షా’గా పేరొందిన లవ్జీ దాలియా సూరత్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దాంతోపాటు వజ్రాల వ్యాపారిగా, పవర్ లూమ్ యజమానిగా లావ్జీకి గుర్తింపు ఉంది. ఆయన చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలకు గుర్తింపుగా స్థానికులు తనను బాద్‌షాగా పిలుస్తున్నారు. గోపీన్ డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించారు. లాభాపేక్ష లేని సంస్థ గోపీన్ ఫౌండేషన్ ద్వారా దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫొటోను కూడా గతంలో షేర్ చేశారు.

Trust Board Under Ashok Gajapathi Raju Silent on Simhachalam Tragedy8
సింహాచలం ఘటనపై అశోక్ నోరిప్పలేదేం

సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా భారీ ఎత్తున భక్తులు వచ్చిన తరుణంలో ఏర్పాట్లు... భద్రత వంటి చర్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఏడుగురు భక్తుల ప్రాణాలను గాలిలో కలిపేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు బయటపడుతున్న పలు లోపాలు చూస్తూ భక్తులు విష్టి పోతున్నారు. అతి తక్కువ సమయంలో గోడ నిర్మించలేనని కాంట్రాక్టర్ చెప్పినప్పటికీ పరవాలేదు మేము చూసుకుంటాం ఏదోలా పూర్తిచేసేయ్ అంటూ దేవాలయ యాజమాన్యం మంత్రులు తనపై ఒత్తిడి చేసి తూతూ మంత్రంగా పనులు పూర్తి చేయించారని కాంట్రాక్టర్ అంగీకరించారు. ఇదిలా ఉండగా ఉత్సవానికి ముందు పలువురు మంత్రులు సింహాచలాన్ని సందర్శించి ఏర్పాట్లు పర్యవేక్షించినట్లు పరిశీలించినట్లు సూచనలు సలహాలు ఇచ్చినట్లు పత్రికల్లో కథనాలు ఫోటోలు అయితే వేయించుకున్నారు కానీ వారు ఎక్కడ ఏమి చూసినట్లు లేదు. అలా వచ్చి మామూలుగా అధికారులతో సమావేశమై జ్యూస్ తాగి స్నాక్స్ తిని వెళ్లిపోయారు అన్నది ఈ సంఘటన తర్వాత అర్థమవుతుంది. ఇదంతా ఎలా ఉండగా సింహాచలం దేవస్థానానికి సంబంధించి అనువంశిక ధర్మకర్త ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ గజపతిరాజు ఈ అంశంపై ఇంతవరకు కిక్కురుమనలేదు. గతంలో ఆయన ధర్మకర్తృత్వం లోని రామతీర్థం గుట్టపై శ్రీరాముని విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేసిన ఘటన కు సంబంధించి ఆయన స్పందన విపరీతంగా ఉండేది. కళ్ళు ఎగరేస్తూ గాలిలో చేతులు తిప్పుతూ నాటి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని తూలనాడారు. చైర్మన్ అయిన తనకు కూడా ఏమాత్రం సమాచారం లేదని బాధ్యత వహిస్తే పరిస్థితి వేరుగా ఉండేది అన్నట్లుగా ఆయన మాట్లాడారు. నాటి సంఘటనకు వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి బాధ్యత అని దుమ్మెత్తి పోశారు.నేడు సౌండ్ లేదేం అశోక్ రాజానేడు సింహాచలం అప్పన్న స్వామికి చందనోత్సవం సందర్భంగా తొలి దర్శనం చేసుకుని పట్టు వస్త్రాలు సమర్పించేది కూడా విజయనగరం పూసపాటి కుటుంబీకులే. గతంలో ఆనందగజపతి రాజు ఈ సాంప్రదాయం పాటించగా నేడు అశోక్ గజపతి అప్పన్నకు చైర్మన్ హోదాలో పట్టు వస్త్రాలు సమర్పిస్తూ వస్తున్నారు. మరి దేవాలయ చైర్మన్గా ఆయనకు ఈ దుర్ఘటనతో సంబంధం లేదా..? బాధ్యత లేదా ? అంత పెద్ద ప్రమాదం జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయి మరికొందరు ఆసుపత్రిపాలవగా ఆయన మాత్రం ఏ మాత్రం నోరు విప్పడం లేదు. ఉత్సవాలకు ముందు మంత్రులతో పాటు ఆయన కూడా సమీక్షలో పాల్గొని ఆహా ఓహో అది చేశాను ఇది చేశాం అంటూ ఫోటోలు ప్రకటనలు ఇచ్చి ఇంటికి వచ్చారు తప్ప ప్రమాదం జరిగి ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఆయన ఏమాత్రం స్పందించడం గాని.. దేవాలయ ట్రస్ట్ బోర్డు తరఫున ఓ ప్రకటన కానీ ఇవ్వలేదు.. అసలు ఆ సంఘటన జరిగినట్లే ఆయన గుర్తించినట్లు కనిపించలేదు. ఎందుకంటే తాను కొనసాగుతూ వస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఏ ఆలయంలో ఏం జరిగినా ఆయనకు కనిపించదు.. వినిపించదు. అదే వైయస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా చిత్ర విచిత్రమైన అభినయాలతో అశోక్ గజపతి మీడియా ముందుకు వచ్చేస్తారు.. ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు కూడా ఆయన నోరు విప్పితే తన హుందాతనానికి మరింత గౌరవం వచ్చేదని ప్రజలు అంటున్నారు::సిమ్మాదిరప్పన్న

Vijay devarakonda And Rashmika In One Movie With Mythri Makers9
'విజయ్‌' ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. నిజమే అంటూ 'రష్మిక' హింట్‌

వెండితెరపై విజయ్‌ దేవరకొండ-రష్మికలది (Rashmika) ప్రత్యేకమైన జోడీ అని చెప్పవచ్చు. వారిద్దరు మరో సినిమాలో కలిసి నటించాలని కోరుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో ‘గీత గోవిందం’తో హిట్‌ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట రెండోసారి ‘డియర్‌ కామ్రేడ్‌’తో అభిమానులను మెప్పించిన విషయం తెలిసిందే. ఈ సినిమాల తర్వాత వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ, వాటిపై వారిద్దరూ ఎలాంటి రెస్పాన్స్‌ ఇవ్వలేదు. ఈ సంగతి కాస్త పక్కన పెడితే.. మరోసారి రష్మికతో కలిసి విజయ్‌ దేవరకొండ(Vijay devarakonda) స్క్రీన్‌పై కనిపించనున్నాడని అర్థం అవుతుంది.విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా కొద్దిరోజుల క్రితం ఒక కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్‌ రానుంది. గతంలో ఆయన తెరకెక్కించిన టాక్సీవాలా, శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు విజయ్‌తో మరో సినిమాను ప్లాన్‌ చేశాడు. ఇందులో హీరోయిన్‌గా రష్మిక నటించనుంది. అందుకు సంబంధించిన ఒక హింట్‌ను మొదటగా మైత్రి మూవీస్‌, రాహుల్ సంకృత్యాన్ #HMMLetsee అంటూ ఎక్స్‌ పేజీలో పోస్ట్‌ చేస్తూ.. రష్మికను ట్యాగ్ చేశారు. దానికి ఆమె నిజమే గాయ్స్‌ అంటూ సమాధానం ఇచ్చింది. ఇదంతా విజయ్‌- రష్మికల సినిమా గురించే అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ, HMMLetsee అనే దానికి అర్థమేంటి..? అన్నది మాత్రం క్లారిటీ లేదు. త్వరలోనే ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.డియర్‌ కామ్రేడ్‌ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించారు. ఇప్పుడు మరోసారి విజయ్‌- రష్మికలతో ఒక పెద్ద ప్రాజెక్ట్‌కు ప్లాన్‌ చేశారని తెలుస్తోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు పొందిన రష్మక చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అయినప్పటికీ ఆమె విజయ్‌తో ఉన్న స్నేహం వల్ల తేదీలు సర్ధుబాటు చేయనుందట. VD14 అనే వర్కింగ్‌టైటిల్‌తో పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ మూవీ రానుంది. 18వ శతాబ్దంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ ప్రాజెక్ట్‌ను దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ప్లాన్‌ చేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు చాలా ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. అందుకే రష్మిక అయితే బాగుంటుందని ఫైనల్‌ చేశారని టాక్‌. రష్మికతో కలిసి మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకునేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు గతంలో విజయ్‌ చెప్పిన విషయం తెలిసిందే. ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌తో ఆయన కోరిక తీరబోతుందని అభిమానులు చెబుతున్నారు. #HmmLetsSee @iamRashmika 😉— Mythri Movie Makers (@MythriOfficial) May 2, 2025

Summer Care Sunscreen Essential Tips for Healthy Skin10
Summer Care సన్‌స్క్రీన్‌ వాడాలా? వద్దా?

సమ్మర్‌ (Summer)లో సన్‌స్క్రీన్‌ (Sunscreen) లోషన్‌ వాడడం సర్వసాధారణం. 2030 నాటికి భారత సన్‌స్క్రీన్‌ మార్కెట్‌ బాగా పెరగనుందని ఒక నివేదిక అంచనా వేసింది. అయితే మరోవైపు చూస్తే... ఇంటర్నెట్‌లో ఒకవర్గం సన్‌స్క్రీన్‌ వాడొద్దు అని, వాటివల్ల జరిగే నష్టాలు ఇవి... అంటూ ప్రచారం చేస్తోంది. అందులో నిజం ఎంత?ప్రధానంగా రెండు రకాల సన్‌స్క్రీన్‌లు ఉన్నాయి. 1. మినరల్‌ 2. కెమికల్‌మినరల్‌ సన్‌స్క్రీన్‌లో జింక్‌ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్‌లాంటి క్రియాశీల ఖనిజ పదార్థాలు ఉంటాయి. ఇవి యువి కిరణాలను నిరోధిస్తాయి. ఇక కెమికల్‌ సన్‌స్క్రీన్‌లు అధికశక్తి గల యూవీ కిరణాలను గ్రహిస్తాయి. చర్మాన్ని దెబ్బతీయకుండా నిరోధిస్తాయి. వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రియాశీల పదార్థాలు ఉంటాయి. ఇవేకాకుండా మార్కెట్‌లో కాంబినేషన్‌ సన్‌స్క్రీన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.డెర్మటాలజిస్ట్‌లు ‘సన్‌స్క్రీన్‌ వాడడం మంచిదే’ అని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.‘సన్‌స్క్రీన్‌లోని ఇన్‌గ్రేడియెంట్స్‌ థైరాయిడ్‌ హార్లోన్లు, టెస్టోస్టెరాన్, ప్రొజెస్టెరాన్‌ స్థాయులను దెబ్బతీస్తాయని కొన్ని అధ్యయాలు సూచిస్తున్నాయి. అయితే ఇవి తక్కువస్థాయి ఆధారాలతో కూడిన ప్రాథమిక అధ్యయనాలు మాత్రమే. అందువల్ల సన్‌స్క్రీన్‌లు ఎండోక్రైన్‌ డిస్ట్రప్టర్లు అని నిర్దారించడానికి ఈ ఆధారాలు సరిపోవు’ అంటున్నారు డెర్మటలాజిస్ట్, ఇన్‌ఫ్లూయెంజ్‌ స్కిన్‌ అండ్‌ హేర్‌ క్లినిక్‌ ఫౌండర్‌ గీతికా శ్రీవాస్తవ.ఇదీ చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్‌!జింక్‌ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్‌ ఇన్‌గ్రేడియెంట్స్‌ ఉపయోగించే ఫిజికల్‌ సన్‌స్క్రీన్స్‌ (మినరల్‌ సన్‌స్క్రీన్స్‌) సురక్షితమైనవని, ప్రభావ వంతవైనవని ఎఫ్‌డీఏ (ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌–రిసెర్చ్‌) నిర్ధారించింది. చదవండి : నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్‌ షూస్‌ : ఎవరీ అందాల రాణి?

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement