
ఘనంగా వాల్మీకి జయంతి
విజయనగరం అర్బన్: రామాయణాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి అన్నారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలిత డీఆర్‌వో ఎస్.శ్రీనివాసమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వాల్మీకి రచించిన రామాయణం నేడు యావత్ ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు. వాల్మీకి మహర్షి జయంతిని పురష్కరించుకొని వారి జీవిత చరిత్రను ఒకసారి స్మరించుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి జయంతిని గురించి రామాయణంలోని ఉత్తరకాండలో వివరించబడిందన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారిణి జె.జ్యోతి, సీపీవో పి.బాలాజీ, జిల్లా టూరిజం కల్చర్ అధికారి కుమారస్వామి, ఐసీడీఎస్ పీడీ విమలారాణి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రాణి, మార్క్‌ఫెడ్ మేనేజర్ వెంకటేశ్వరరావు, డివిజనల్ పౌర సంబంధాల అధికారి ఎస్.జానకమ్మ, బీసీ వసతిగృహ సంక్షేమాధికారులు, కలెక్టరేట్‌లోని వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.