జర్నలిస్టులకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులకు అండగా ఉంటాం

Feb 6 2026 7:24 AM | Updated on Feb 6 2026 7:24 AM

జర్నలిస్టులకు అండగా ఉంటాం

జర్నలిస్టులకు అండగా ఉంటాం

మహారాణిపేట: వర్కింగ్‌ జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్లు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. గురువారం ఏపీ ఎన్జీవో హోంలో ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టులు ఫెడరేషన్‌ సభ్యత్వ నమోదు, రెన్యువల్‌ ప్రక్రియకు అనూహ్య స్పందన లభించింది. ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు పి.నారాయణ్‌, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావులతో కలిసి గంట్ల శ్రీనుబాబు మీడియాతో మాట్లడారు. అక్రిడేషన్‌ కమిటీల్లో సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించడం శుభపరిణామమని, అలాగే పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాలు, పెన్షన్ల సమస్యలను ప్రభుత్వం దశలవారీగా పరిష్కరించాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు 400 మందికి పైగా సభ్యత్వం తీసుకున్నారని, ఫిబ్రవరి 9తో ఈ ప్రక్రియ ముగుస్తుందన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు పి నగేష్‌ బాబు, బ్రాడ్‌ కాస్టింగ్‌ అధ్యక్షుడు ఈరోతి ఈశ్వరరావు, అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement