
డివైడర్‌ను ఢీకొని యువకుడి మృతి
బీచ్‌రోడ్డు: దసరా పండుగ సందర్భంగా కొనుగోలు చేసిన కొత్త ద్విచక్రవాహనం ఓ యువకుడికి శాపంగా మారింది. బైక్ కొనుగోలు చేసిన నాలుగు రోజులకే జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాణిపేట నివాసి సీరందాస్ హరీష్ (19) దుర్మరణం పాలయ్యాడు. మూడో పట్టణ ట్రాఫిక్ పోలీసులు ఈ వివరాలను అందించారు. పోలీసుల వివరాల ప్రకారం..హరీష్ ఆదివారం అర్ధరాత్రి తన స్నేహితుడు వినయ్‌తో కలిసి రూ. 2.80 లక్షల విలువైన యమహా ద్విచక్రవాహనంపై టిఫిన్ చేయడానికి కాంప్లెక్స్‌కు వెళ్లాడు. టిఫిన్ ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా, దత్త ఐల్యాండ్ మలుపు వద్ద బైక్ అతివేగం కారణంగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న హరీష్‌కు తీవ్ర గాయాలు తగిలాయి. వెంటనే అతడిని 108 అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వెనకాల కూర్చున్న వినయ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
తీరని విషాదం
తండ్రి శ్రీనివాసరావుతో గొడవపడి మరీ దసరాకు బైక్ కొనిపించుకున్నాడు. హరీష్ మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ట్రాఫిక్ సీఐ అమ్మినాయుడు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్ మార్చరీకి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

డివైడర్‌ను ఢీకొని యువకుడి మృతి