మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణపై ఉవ్వెత్తున ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణపై ఉవ్వెత్తున ఉద్యమం

Oct 7 2025 3:21 AM | Updated on Oct 7 2025 3:21 AM

మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణపై ఉవ్వెత్తున ఉద్యమం

మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణపై ఉవ్వెత్తున ఉద్యమం

9న నర్సీపట్నం మెడికల్‌ కాలేజీని సందర్శించనున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 7 నియోజకవర్గాల మీదుగా రోడ్‌ షోగా వెళ్లే అవకాశం వైఎస్‌ జగన్‌ను కలవనున్న స్టీల్‌ ప్లాంట్‌, షుగర్‌ ఫ్యాక్టరీ, బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ బాధితులు వైఎస్సార్‌ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు అమర్‌నాఽథ్‌, కేకే రాజు

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌ సీపీ ఉవ్వెత్తున ఉద్యమిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. సోమవారం మద్దిలపాలెంలో గల పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నర్సీపట్నంలో మెడికల్‌ కళాశాలను సందర్శించనున్నారని తెలిపారు. ఈ పర్యటన విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఏడు నియోజకవర్గాల మీదుగా రోడ్‌ షోగా సాగుతుందన్నారు. వైఎస్‌ జగన్‌ను స్టీల్‌ ప్లాంట్‌, షుగర్‌ ఫ్యాక్టరీ, బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ బాధితులు కలవనున్నారని తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం చేస్తున్న ఆలోచనలు తెలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తన మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం స్పష్టంగా వెల్లడిస్తున్నా.. కూటమి పార్టీల ఎంపీలు, మంత్రులు ఏమీ పట్టనట్లుగా ఉన్నారన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌ సీపీ పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు పూనుకోవడంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్న వనరులను కూటమి నేతలు దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా యూనివర్సిటీలో కనీస మౌలిక వసతులు కల్పించకుండా.. కూటమి నేత సొంత యూనివర్సిటీ కోసం నిర్వీర్యం చేస్తున్నారని వాపోయారు. విద్య, వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా జీవీఎంసీ పరిధిలోని చిరువ్యాపారుల దుకాణాలను తొలగించి వారి పొట్టకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణే్‌ష్‌కుమార్‌, మళ్ల విజయప్రసాద్‌, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ నెల 9వ తేదీన వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్‌, చింతలపూడి వెంకట రామయ్య, రాష్ట్ర కార్యదర్శులు చింతకాయల సన్యాసిపాత్రుడు, డిప్యూటీ మేయర్‌ కె.సతీష్‌, సీఈసీ సభ్యుడు కోలా గురువులు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీ, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి తాడి జగన్నాథ రెడ్డి రాష్ట్ర, క్రిస్టియన్‌ మైనారిటీ విభాగం అధ్యక్షుడు బొల్లవరపు జాన్‌ వెస్లీ, ఎస్‌ఈసీ సభ్యులు ఉరుకూటి అప్పారావు, బాణాల శ్రీనివాసరావు, డాక్టర్‌ జహీర్‌ అహ్మద్‌, పిన్నమరాజు సతీష్‌ వర్మ, ఐ.హెచ్‌.ఫారూఖీ, పోతిన హనుమంత రావు, జోనల్‌ అనుబంధ విభాగం అధ్యక్షులు అంబటి శైలేష్‌, తుమ్మలూరు జగదేష్‌ రెడ్డి, ముట్టి సునీల్‌ కుమార్‌, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు పేడాడ రమణి కుమారి, ఉరుకూటి చందు, బోని శివ రామకృష్ణ, భర్కత్‌ అలీ, పులగం కొండారెడ్డి, అనిల్‌ కుమార్‌, కర్రి రామా రెడ్డి, పీలా ప్రేమ కిరణ్‌ జగదీష్‌, శ్రీదేవి వర్మ, వాసుపల్లి యల్లాజీ, వంకాయల మారుతీ ప్రసాద్‌, దిలీప్‌ కుమార్‌, సకలభక్తుల ప్రసాద్‌రావు, బోండా ఉమా మహేశ్వర రావు, నీలి రవి, పార్టీ ముఖ్యనాయకులు నడింపల్లి కృష్ణరాజు, పిల్లా సుజాత సత్యనారాయణ, అల్లంపల్లి రాజబాబు, పల్లా దుర్గారావు, రామన్నపాత్రుడు, షరీఫ్‌, వెంకట నారాయణ, చిన్న దాస్‌, కార్పొరేటర్లు ఎ.శంకర్‌రావు, పీవీ సురేష్‌, రేయి వెంకట రమణ, ఏడుకొండలరావు, కోరుకొండ స్వాతి దాస్‌, నక్కిల లక్ష్మీ, సాడి పద్మారెడ్డి, బిపిన్‌ కుమార్‌ జైన్‌, చెన్న జానకి రామ్‌, గుండపు నాగేశ్వరరావు, వావిలపల్లి ప్రసాద్‌, శశికళ, సాయి అనూష, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement