
రూ.999కే గుండె పరీక్షల ప్యాకేజీ
ఆరిలోవ: ప్రపంచ హృదయ దినోత్సవం పురస్కరించుకుని హెల్త్‌సిటీలోని కేర్ ఆస్పత్రి హార్ట్‌స్మార్ట్ ప్యాకేజీని ప్రారంభించింది. ఆస్పత్రిలో సోమవారం జరిగిన కార్యక్రమంలో వైద్యులు ఈ ప్యాకేజీ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి.వి.రావు మాట్లాడుతూ.. గుండె జబ్బులు యువతలో కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. చాలా మంది యువతలో ఉన్న ప్రమాదకరమైన నిశ్శబ్ద కారకాలు గురించి అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడం వంటి జీవనశైలి కారకాలు యువతలో గుండె వ్యాధులకు దారి తీస్తున్నాయని తెలిపారు. నిశ్శబ్ద కారకాలను ముందుగానే గుర్తించి నివారించడానికి ప్రతి ఒక్కరూ తరుచూ గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ సి.వి.రావు సూచించారు. కేర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మయూఖ్ చైదురి మాట్లాడుతూ హార్ట్‌స్మార్ట్ ప్యాకేజీలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, 2డీ ఎకో, ట్రెడ్‌మిల్ టెస్ట్ తదితర పరీక్షలు కేవలం రూ.999కే చేస్తామని తెలిపారు.