
మసీదు పక్కన మద్యం దుకాణమా?
మహారాణిపేట: రామా టాకీస్ సమీపంలోని యాసీన్ మసీదు పక్కన మద్యం దుకాణానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని యాసీన్ మసీదు ముస్లిం కమిటీ వెల్ఫేర్ సొసైటీ నాయకులు కోరారు. సొసైటీ నాయకులు మహ్మద్ అహ్మదుల్లా ఖాన్, సయ్యద్ మహ్మద్ పీజీఆర్‌ఎస్‌లో సోమవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. 70 ఏళ్ల కిందట నిర్మించిన యాసీన్ మసీదుకు ఎంతో చరిత్ర ఉందని, ఈ మసీదు దగ్గరలో మద్యం దుకాణానికి అనుమతి ఇవ్వడం తగదని సొసైటీకి చెందిన డాక్టర్ అబ్దుల్ రహ్మాన్, దేవరకొండ మార్కండేయులు అన్నారు. ప్రార్థనా స్థలం, బుల్లయ్య కాలేజీ పక్కన మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం వల్ల ఆ ప్రాంతంలో శాంతిభద్రతల సమస్యలు వచ్చే అవకాశం ఉందని, మద్యం దుకాణం ఏర్పాటుకు ఇచ్చిన అనుమతిని తక్షణమే రద్దు చేయాలని వారు కోరారు.
రద్దు చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు