SRH vs RR: మ్యాచ్‌కు వెళ్తున్నారా?.. వీటిపై నిషేధం | IPL 2026 SRH vs RR Disallowed Items List During matches in Uppal stadium | Sakshi
Sakshi News home page

SRH vs RR: మ్యాచ్‌కు వెళ్తున్నారా?.. వీటిపై నిషేధం

Apr 13 2026 5:13 PM | Updated on Apr 13 2026 5:37 PM

IPL 2026 SRH vs RR Disallowed Items List During matches in Uppal stadium

ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతమైదానంలో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌ను సోమవారం ఢీకొట్టనుంది. కాగా ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్‌ ఒకటి మాత్రమే గెలిచింది.

ఆసక్తికర పోరు
మరోవైపు.. రాజస్తాన్‌ నాలుగు విజయాలతో టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతోంది. అయితే, సొంతమైదానంలో సత్తా చాటాలని సన్‌రైజర్స్‌ పట్టుదలగా ఉండగా.. రాజస్తాన్‌ ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తోంది. దీంతో ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారనుండగా.. మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు సిద్ధమైపోయారు. అటు రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ.. ఇటు సన్‌రైజర్స్‌ ఓపెనింగ్‌ జోడీ అభిషేక్‌ శర్మ- ట్రవిస్‌ హెడ్‌  విధ్వంసకర బ్యాటింగ్‌ను ఆస్వాదించాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఈ నేపథ్యంలో మల్కాజిగిరి కమిషనరేట్‌ ప్రేక్షకులు స్టేడియానికి తీసుకురాకూడని వస్తువుల గురించి గుర్తు చేసింది. ఇందుకు సంబంధించి ఫొటో విడుదల చేసింది. నిషిద్ధ వస్తువులను తీసుకురాకూడదని హెచ్చరించింది. స్టేడియంలో వస్తువులు భద్రపరిచేందుకు ఎలాంటి క్లాక్‌రూమ్‌ అందుబాటులో ఉండదని తెలిపింది.

స్టేడియానికి తీసుకువెళ్లకూడని నిషిద్ధ వస్తువులు ఇవే
👉కెమెరాలు, ఇతర రికార్డింగ్‌ పరికరాలు
👉బ్లూటూత్‌ హెడ్‌ఫోన్స్‌, ఇయర్‌ఫోన్స్‌, ఎయిర్‌పాడ్స్‌
👉సిగరెట్లు, లైటర్‌, అగ్గిపెట్టె
👉తుపాకులు, కత్తులు, ఇతరత్రా ఆయుధాలు
👉నీళ్ల బాటిళ్లు, ఆల్కహాల్‌, కూల్‌డ్రింక్స్‌
👉పెంపుడు జంతువులు
👉తినుబండారాలు
👉బ్యాక్‌పాక్స్‌, హ్యాండ్‌బ్యాగ్స్‌
👉ల్యాప్‌టాప్స్‌, సెల్ఫీ స్టిక్కులు
👉హెల్మెట్స్‌, బైనాక్యులర్స్‌
👉పేలుడు పదార్థాలు, ఫైర్‌ క్రాకర్స్‌
👉డ్రగ్స్‌.

చదవండి: BCCI: వైభవ్‌ సూర్యవంశీపై నిషేధం?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement