భామిని: మండలంలోని బత్తిలి, భామిని, బొడ్డగూడ ఫీల్డ్ అసిస్టెంట్లు సుమన్, మధు, రమేష్‌తో పాటు టీఏ భీమారావును సస్పెండ్ చేస్తున్నట్టు డ్వామా పీడీ జె.రామచంద్రరావు శుక్రవారం సామాజిక తనిఖీ కార్యక్రమంలో వెల్లడించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ ఎస్.వసంతకుమారి అధ్యక్షతన జరిగిన ఉపాధి సామాజిక తనిఖీ ప్రజా వేదికలో పీడీ పాల్గొన్నారు. బత్తిలి, భామిని, బొడ్డగూడ పంచాయతీల్లో జరిగిన ఉపాధి వేతనదారుల పెంపులో నిర్లక్ష్యంతో మండిపడ్డారు. జనవరి నుంచి వేతనదారుల పెంపు పట్టించుకోకపోవడంతో పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ ఆడిట్‌లో బయటపడిన అంశాలను ఎస్‌ఆర్‌పీలు వివరించారు. అనంతరం వేతనదారుల పెంపు లేకపోవడం గుర్తించిన పీడీ వారిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మిగతా సిబ్బంది తీరు మారకుంటే ఇలాగే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లా ఉపాధి విజిలెన్స్ అధికారి రమణమూర్తి, ఏపీఓ బాబూరావు, సామాజిక తనిఖీ సిబ్బంది, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
సామాజిక తనిఖీలో పీడీ వెల్లడి


