
సైన్స్ అండ్ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): పర్యాట క, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్‌లో సోమవారం ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్‌గా నియమితులైన మందలపు రవికుమార్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీని వినియోగించుకుని అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎస్. రోషన్‌కుమార్, బడేటి రాధాకృష్ణ, ఎం.వెంకటరాజు, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొని రవికుమార్‌ను అభినందించారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రత్యేక రైలులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల యాత్రను నవంబర్‌లో ప్రారంభించనున్నామని భారతీయ రైల్వేస్ భారత్ గౌరవ ట్రైన్, సౌత్ స్టార్ రైల్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని ఓ హోటల్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక పర్యాటక రైలులో తమిళనాడు, కేరళలో ఉన్న దేవాలయాలు, పంచ ద్వారక, మహదేవ్, జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చని తెలిపారు. నవంబర్ 16వ తేదీన మొదటి విడత యాత్ర, 26న రెండో విడత యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇండియన్ రైల్వే, మొదటి భారత్ గౌరవ్ రైలు, సౌత్ స్టార్ రైల్, అతిపెద్ద టూరిస్ట్ రైలు ఆపరేటర్ టూర్ టైమ్స్ ఈ యాత్ర చేపట్టిందన్నారు. ఈ ప్రత్యేక పర్యాటక రైలు ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో లేదన్నారు. రిజర్వేషన్ల కోసం టూర్ టైమ్స్‌ను నేరుగా 93550 21516 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చన్నారు. అందుకోసం www.tourtimes.in సందర్శించాలన్నారు.

సైన్స్ అండ్ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు