
వైఎస్సార్ సీపీ ఎస్‌ఈసీ సభ్యుడిగా డాక్టర్ మెహబూబ్ షేక
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా విజయవాడకు చెందిన డాక్టర్ మెహబూబ్ షేక్ నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేసింది. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఆయన క్రియాశీలక నేతగా ఉన్నారు. మూడుసార్లు వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వైద్య విభాగం జోనల్ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం వైద్య విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పార్టీకి అందించిన సేవలను గుర్తించి ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమించారు. మెహబూబ్ షేక్ ఉమ్మడి కృష్ణాజిల్లా వైద్య విభాగం ఆధ్యక్షుడిగా ఉన్న సమయంలో మెగా వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. గ్రహణ మొర్రితో బాధపడుతున్న వారికి ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించారు. 2019 ఎన్నికల సమయంలో సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకునిగా వ్యవహరించారు. తనపై నమ్మకంతో పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడిగా నియమించినందుకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌కు, ఇతర నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మెహబూబ్ షేక్‌కు అభినందనలు తెలిపారు.