
స్థానిక ఎన్నికల్లో గెలవాలి
● మంత్రి జూపల్లి కృష్ణారావు ● ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం
నిర్మల్‌టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సోమవారం సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అన్ని స్థానాలు కాంగ్రెస్ కై వసం చేసుకునేలా పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలో పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని తెలిపారు. అనంతరం మంత్రిని నేతలు శాలువాతో సత్కరించారు. సమావేశంలో మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, సీనియర్ నాయకులు వేణుగోపాలచారి, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.