
‘అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న బీజేపీ’
లక్ష్మణచాంద: బీజేపీ తన అధికారాన్ని దుర్వి నియోగం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను అణ చివేయాలని చూస్తోందని టీపీసీసీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి రామ్ భూపాల్, డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు ఆరోపించారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం కనకాపూర్‌లో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ రాహుల్ గాంధీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పాల్పడిన ఓట్ల చోరీపై అలుపెరుగని పో రాటం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, నిర్మల్, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు సోమా భీమ్‌రెడ్డి, అబ్దుల్ హాది, పార్టీ మండల అధ్యక్షుడు తక్కల విద్యాసాగర్‌రెడ్డి, బొల్లోజీ నర్సయ్య, ఒడ్నాల రాజేశ్వర్, బుజంగా శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.